Hyderabad Rains: హైదరాబాద్ లో మళ్లీ కుండపోత.. లోతట్టు ప్రాంతాల్లో భయంభయం

Hyderabad Rains: హైదరాబాద్ ను వరుణుడు విడిచిపెట్టేలా కనిపించడం లేదు. గ్రేటర్ పరిధిలో మళ్లీ కుండపోతగా వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఎండ దంచికొట్టింది,. ఉక్కపోతగా జనాలు ఇబ్బంది ప్డడారు.   

Written by - Srisailam | Last Updated : Jul 29, 2022, 05:53 PM IST
Hyderabad Rains: హైదరాబాద్ లో మళ్లీ కుండపోత.. లోతట్టు ప్రాంతాల్లో భయంభయం

Hyderabad Rains: హైదరాబాద్ ను వరుణుడు విడిచిపెట్టేలా కనిపించడం లేదు. గ్రేటర్ పరిధిలో మళ్లీ కుండపోతగా వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఎండ దంచికొట్టింది,. ఉక్కపోతగా జనాలు ఇబ్బంది ప్డడారు. అయితే 3 గంటల ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. కాసేపటికే వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. మియాపూర్, మాదాపూర్, కూకట్ పల్లి, నిజాంపేట, ఖైరతాబాద్, చింతల్, గాజుల రామారం, లక్డీకాపూల్‌, అసెంబ్లీ, బషీర్‌బాగ్‌, బేగంబజార్‌, కోఠి, సుల్తాన్‌బజార్‌, అబిడ్స్‌, ఎల్బీనగర్, దిల్ షుక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నాంపల్లి,  ముషీరాబాద్‌, చిక్కడపల్లి,  ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 

సాయంత్రం ఐదు గంటల వరకు నేరెడ్ మెట్ లో అత్యధికంగా 95 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. మల్కాజ్ గిరి ఆనంద్ బాగ్ లో 73, తిరుమలగిరిలో 63, హయత్ నగర్ లో 62, ఏఎస్ రావు నగర్ లో 60, ఫతేనగర్ లో 54, బేగంపేటలో 50, అల్వాల్ లో 48, మౌలాలి, ఎల్బీనగర్ లో 45, వనస్థలిపురం, బాలానగర్ లో 40 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. 

వరద నీరు రోడ్లపైకి చేరింది. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. వరద నీటితో నగరంలోని ప్రధాన కూడళ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి మూసీనదిపై ఉన్న మూసారంబాగ్‌ వంతెన పూర్తిగా నీట మునిగింది.  రెండు రోజుల పాటు వంతెనను అధికారులు మూసివేశారు. మళ్లీ భారీ వర్షం కురవడంతో మూసారాంబాగ్‌ వంతెనపై మళ్లీ నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు మళ్లీ అంతరాయం ఏర్పడింది.  కాచిగూడ ట్రాఫిక్‌ పోలీసులు బ్రిడ్జిపై నిలిచిన నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read Also: Ashwini Dutt: నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు.. వెనక్కు తగ్గిన అశ్వినీదత్.. వారి నిర్ణయమే శిరోదార్యం అంటూ!

Read Also: Liger Attitude: విజయ్ ఇచ్చి పడేశాడుగా... దుమ్ము రేపుతున్న లైగర్ 'వాట్ లగా దేంగే' సాంగ్..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News