Revanth Reddy: మరో ప్రజా పోరాటానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్‌..త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..!

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్‌ స్పీడ్ పెంచింది. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటాన్ని ఉధృతం చేసింది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది.

Written by - Alla Swamy | Last Updated : Jul 31, 2022, 08:02 PM IST
  • తెలంగాణలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్
  • ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరాటం
  • త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
Revanth Reddy: మరో ప్రజా పోరాటానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్‌..త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..!

Revanth Reddy: నిత్యావసర ధరల పెంపుపై దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఈక్రమంలో ఆగస్టు 5న తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలు ధర్నాలు, రాస్తారోకోలు చేయనున్నారు. ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వెల్లడించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెంపు, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, అగ్నిపథ్‌ వంటి వాటికి వ్యతిరేకంగా ఆందోళనలు, ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు. 

నిత్యావసరాలపై జీఎస్టీ పెంపునకు నిరసనగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్‌ పార్టీ ప్రజా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో భారీ వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిందని గుర్తు చేశారు. 20 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగిందన్నారు. వరదలు, వర్షాలతో ఇప్పటివరకు రూ. 2 వేల కోట్ల వరకు నష్టం జరిగిందన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఇంత నష్టం జరిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

వరద నష్టంపై ప్రధాని మోదీకి లేఖలు రాసినా చలనం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్రాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై కేంద్రాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గోదావరి వరదల్లో చనిపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకోవాలన్నారు. 

ఆగస్టు 5న చేపట్టే నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఆందోళన చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పారు రేవంత్‌రెడ్డి. రాష్ట్ర రాజధానిలో పీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇందులో ప్రజలంతా పాల్గొనేలా చూడాలన్నారు. ఈమేరకు నేతలు, కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు.

Also read:ITR Filing: రికార్డు స్థాయిలో ఐటీఆర్ దాఖలు..మరోసారి గడువు పెంచబోతున్నారా..?

Also read:Sourav Ganguly: గంగూలీ అభిమానులకు గుడ్‌న్యూస్..బ్యాట్ పట్టనున్న దాదా..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News