భారీ వర్షాలకు ( Heavy Rains in Hyderabad ) హైదరాబాద్ జంట నగరాలు వణికిపోతున్నాయి. తెలంగాణ ( Telangana )రాజధాని నగర వీధుల్లో కార్లు ప్రవహిస్తున్నాయి. ఎక్కడ చూసిన కార్ల కొట్టుకుపోతున్న దృశ్యాలే కన్పిస్తున్నాయి.
తూర్పు బంగాళాఖాతం ( East Bay of Bengal ) లో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ), తెలంగాణల్లో గత మూడ్రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరం మొత్తం వరద నీటితో నిండిపోయింది. పాతబస్తీలో ఒకే కుటుంబం నుంచి 8 మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. నాలాలు, వాగుల పొంగి పొర్లడంతో పలు కాలనీలు జలదిగ్భంధనంలో ఉండిపోయాయి. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ ( Hussain sagar ) గేట్లు మొత్తం ఎత్తివేశారు. అటు మూసీ నది ( Moosi River ) పొంగి ప్రవహిస్తూ..చాదర్ ఘాట్, మలక్ పేట్ ప్రాంతాల్ని ముంచెత్తుతోంది.
#WATCH Telangana: River Musi flows over Chaderghat New Bridge towards Malakpet in Hyderabad due to heavy rains. pic.twitter.com/y1ouZ4enCM
— ANI (@ANI) October 14, 2020
ప్రాజెక్టు గేట్లు ఎత్తినట్టుగా వరద ఉదృతి నగర వీధుల్లో కన్పిస్తోంది. వీధుల్లో ప్రవహిస్తున్న వరద ధాటికి పెద్ద పెద్ద కార్లు కొట్టుకుపోతున్నాయి. అపార్ట్మెంట్ల సెల్లార్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
#WATCH Telangana: A car collides with other cars after getting washed away in New Bowenpally area of Hyderabad.
Heavy downpour has created a flood-like situation in several areas of the state capital. pic.twitter.com/y9nfe09VIO
— ANI (@ANI) October 14, 2020
ఈ దృశ్యం న్యూ బోయిన్ పల్లిలోనిది. ఇక్కడ ఓ అపార్ట్‌మెంట్ కింద పార్క్ చేసిన కారుపైకి వరద ప్రవాహానికి కొట్టుకొచ్చిన మరో కారు ఎక్కేసింది. అంతలోనే అదే వరదలో మరో కారు కొట్టుకొచ్చి ఈ రెండు కార్లను ఢీ కొట్టింది. ఇలాంటి దృశ్యాలు నగరంలోని ప్రతి కాలనీలో దర్శనమిస్తున్నాయి. ఇక మోటార్ సైకిళ్ల సంగతైతే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్ని కొట్టుకుపోయాయో..ఎక్కడికి కొట్టుకుపోయాయో తెలియని పరిస్థితి.
హైదరాబాద్ ( Hyderabad ) లో ఇప్పటివరకు 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద నీటి ఉధృతి అంతకంతకు పెరిగిపోతుండటంతో మూసీ, హుసేన్ సాగర్ గేట్లు తెరిచారు. ముఖ్యంగా అశోక్‌నగర్, హిమాయత్‌నగర్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో హైఅలర్ట్ విధించారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే తెలంగాణలో 15 మంది వరకూ మరణించినట్టు తెలుస్తోంది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు రెండ్రుజుల పాటు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. Also read: Hyderabad: లోతట్టు ప్రాంతల్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్