నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో హెలిక్యాప్టర్, 400 మంది ఇంజనీర్ల సేవలు

నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో హెలిక్యాప్టర్, 400 మంది ఇంజనీర్ల సేవలు

Last Updated : Apr 8, 2019, 12:43 PM IST
నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో హెలిక్యాప్టర్, 400 మంది ఇంజనీర్ల సేవలు

హైదరాబాద్: దేశంలోనే అత్యధికంగా 185 నామినేషన్స్ దాఖలైన ఏకైక లోక్ సభ నియోజకవర్గంగా రికార్డ్ సృష్టించిన నిజామాబాద్ ఎన్నికల నిర్వహణ విషయంలోనూ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. నిజామాబాద్ లోక్ సభ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో కలిపి మొత్తం 1788 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ఒక్కో కేంద్రంలో ఒక్కో వీవీప్యాట్‌, ఒక్కో కంట్రోలింగ్‌ యూనిట్‌తోపాటు 12 ఈవీఎంల చొప్పున మొత్తం 25వేలకుపైగా ఈవీఎంలు ఉపయోగించనున్నారు. భారీ సంఖ్యలో ఈవీఎంలను ఉపయోగించనున్న కారణంగా ముందస్తుగానే వాటిని పరిశీలించేందుకుగాను హైదరాబాద్, బెంగుళూరు నుంచి 150 మంది ఇంజనీర్లు నిజామాబాద్‌కు తరలివచ్చారు. 

ఎన్నికలు జరిగే రోజున ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తితే, ఆయా లోపాలను సరిదిద్దడానికి వీలుగా మొత్తం లోక్ సభ నియోజకవర్గం పరిధిలో సుమారు 400 మంది ఇంజనీర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల విధులకు హాజరుకానున్నారు. 185 మంది అభ్యర్థుల వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ప్రతీ కేంద్రం వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఇవన్నీ కాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంలు మొరాయిస్తే, ఎన్నికల నిర్వహణకు అవాంతరాలు తలెత్తకుండా వెంటనే ఈవీఎంలను మార్చడానికి వీలుగా నియోజకవర్గం పరిధిలో ఒక హెలిక్యాప్టర్‌ సేవలను సైతం వినియోగించనున్నారు.

Trending News