భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలం..నేడు సెలవు

Last Updated : Oct 4, 2017, 10:33 AM IST
భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలం..నేడు సెలవు

భారీ వర్షం..భాగ్యనగరాన్ని ముంచేసింది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. చిన్నగా మొదలైన వాన తీవ్రరూపం దాల్చింది. దీంతో  హైదరాబాద్ నగరంలో జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాపూర్తిగా నిలిచిపోయింది. నగరంలో ఎక్కడ చూసినా రోడ్లపై నీరు చేరింది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల చెట్లు, విద్యస్తంభాలు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

భారీ వర్షానికి చిన్నారి సహా ముగ్గురు బలి

హైదరాబాద్ నగరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి.. ఓ చిన్నారితో సహా ముగ్గురు మృతిచెందారు. గోడకూలి చిన్నారితో సహా అతని తండ్రి చనిపోగా..మరో వ్యక్తి విద్యుత్ తీగలు మీదపడటంతో మృతి చెందినట్లు తెలిసింది. 

 

 

 గత పదేళ్లలో అత్యధిక వర్షపాతం..

సుమారు పది నుంచి పదమూడు సెంటీమీటర్లమేర కురిసిన వర్షం ధాటికి హైదరాబాదు అతలాకుతలమైంది.  గత పదేళ్లలో అత్యధిక వర్షపాతం ఇదే కావడం విశేషం. ఇలా ఉండగా ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని..వర్షంతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

కొనసాగుతున్న సహాయక చర్యలు..

హైదరాబాద్ నగరంలో ఇంటి తీవ్రమైన వర్షాన్ని ఈ మధ్యకాలంలో చూడలేదని జీహెచ్‌ఎంసీ పేర్కొన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ రోజు కూడా భారీ వర్షం ముంచెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో .. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ రోజు నగరంలో విద్యాసంస్థలు, కార్యాలయాలకు టి సర్కార్ సెలవు ప్రకటించింది. ప్రైవేటు సంస్థలు కూడా సెలవు తీసుకోవాలని సూచనలు జారీ చేసింది. 

Trending News