Driving license to dwarf: హైదరాబాద్​ మరగుజ్జుకు డ్రైవింగ్ లైసెన్స్​- దేశంలోనే తొలిసారి!

Driving license to dwarf: తెలంగాణకు చెందిన శివ్​లాల్​ అనే వ్యక్తి రికార్డు సృష్టించారు. దేశంలో డ్రైవింగ్ లైసెన్స్​ పొందిన మరగుజ్జుగా ఆయన నిలిచారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2021, 08:06 AM IST
  • దేశంలో తొలిసారి ఓ మరగుజ్జుకు డ్రైవింగ్ లైసెన్స్​
  • హైదారాబాద్​కు చెందిన శివ్​లాల్​ అనే వ్యక్తి ఘనత
  • ఆయన ఎత్తు మూడు అడుగులు
Driving license to dwarf: హైదరాబాద్​ మరగుజ్జుకు డ్రైవింగ్ లైసెన్స్​- దేశంలోనే తొలిసారి!

Driving license to dwarf: సంకల్ప బలం ఉండాలే కానీ శారీరక ఇబ్బందులు అడ్డంకి కాదని మరోసారి నిరూపితమైంది. హైదరాబాద్​కు చెందిన గట్టిపల్లి శివ్​లాల్ (Gattipally Shivpal) అనే వ్యక్తి దీనిని నిజం చేసి చూపించారు. శారీరక లోపం వల్ల ఎంతో మంది తనను కించ పరిచినా.. పట్టు వదలని విక్రమార్కుడిలా అనుకున్నది సాధించారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన చేసిన పనులు రికార్డులు సృష్టించడం విశేషం.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్​ పొందాలంటే.. విద్యా అర్హతలతో శారీరకంగా కూడా ఎత్తు చూస్తారు (కచ్చితం కాదు). ముఖ్యంగా కార్లకు ఇచ్చే డ్రైవింగ్ లైసెన్స్​ విషయంలో ఎత్తు తక్కువగా ఉన్నవారు లైసెన్స్​ తీసుకోవడం కష్టంగా మారుతుంది. చాలా మంది తాము.. డ్రైవింగ్ చేయలేమని.. ఈ విషయం గురించి ఆలోచించరు కూడా.

అయితే గట్టిపల్లి శివ్​లాల్​ మాత్రం అందరిలా కూకుండా.. తానెందుకు సాధించలేను? అనే ఉద్దేశంతో అనుకున్నది పట్టుదలతో సాధించి చూపారు. ఎత్తు తక్కువగా ఉన్నా పట్టుదలతో  కారు నేర్చుకుని.. తాజాగా డ్రైవింగ్ లైసెన్స్​ కూడా (Hyderabad dwarf Gets Driving license ) పొందారు. శివ్​లాల్​ ఎత్తు మూడు అడుగులు మాత్రమే. ఎత్తు తక్కువగా ఉన్నా వారందరికి శివ్​లాల్ ఇప్పుడు ఓ ఆదర్శం.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో గొప్ప విషయమేమిటంటే.. తెలంగాణాలోనే కాదు భారత్​లో డ్రైవింగ్ లైసెన్స్​ పొందిన  తొలి మరగుజ్జుగా శివ్​లాల్​ రికార్డు (First dwarf Gets Driving license) సృష్టించారు.

ఆయితే శివ్​లాల్ తన కోసం.. కారులో మార్పులు చేయించుకున్నారు. దాని ద్వారానే డ్రైవిగ్ నేర్చుకుని.. లైసెన్స్​ (dwarf Gets Driving license)  పొందారు.

శివ్​లాల్ 2004 లో డిగ్రీ పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ పట్టా పొందిన తొలి మరగుజ్జు కూడా శివ్​లాల్ కావడం విశేషం. ఆయన వయసు 42 సంవత్సరాలు.

శివ్​లాల్ రికార్డులు ఇలా..

తాను ఎత్తు తక్కువగా ఉండటం వల్ల.. చాలా మంది తనను టీజ్​ చేసే వారని శివ్​లాల్​ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు తాను.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్​ సహా మరిన్ని రికార్డులు సాధించినట్లు చెప్పారు.

ఎత్తు తక్కువగా ఉన్నవారెంతో మంది ప్రస్తుతం తనను సంప్రదిస్తున్నారని.. డ్రైవింగ్ నేర్పించమని కోరుతున్నట్లు శివ్​లాల్​ చెప్పారు. వారందరికోసం వచ్చే ఏడాది ఓ డ్రైవింగ్ స్కూల్​ ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

Also read: Shilpa Chowdary : శిల్ప చౌదరి కేసులో కొత్త కోణం, రాధికకు డబ్బులు ఇవ్వడంతోనే మోసపోయిందట

Also read: Hyderabad: 14ఏళ్ల బాలుడిపై మేనత్త లైంగిక దాడి-ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News