Shilpa Chowdary : శిల్ప చౌదరి కేసులో కొత్త కోణం, రాధికకు డబ్బులు ఇవ్వడంతోనే మోసపోయిందట

Shilpa Chowdary’s investment scam update : శిల్పా చౌదరిని నార్సింగ్‌ పోలీసులు ఇవాళ కూడా ప్రశ్నించారు. పలువురి నుంచి తీసుకున్న డబ్బును ఏం చేశావని శిల్పను పోలీసులు ప్రశ్నించారు. అయితే తన వద్ద రాధిక అనే మహిళ డబ్బులు తీసుకుందని శిల్ప చెప్పినట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 07:32 PM IST
  • శిల్పా చౌదరి కేసులో రోజుకొక కొత్త కోణం
  • రెండు రోజుల పాటు పోలీసుల విచారణ
  • రాధిక అనే మహిళ తన డబ్బు తీసుకుందని చెప్పిన శిల్ప చౌదరి
Shilpa Chowdary : శిల్ప చౌదరి కేసులో కొత్త కోణం, రాధికకు డబ్బులు ఇవ్వడంతోనే మోసపోయిందట

Socialite Shilpa Chowdary’s investment scam update Shilpa reveals a new name : అధిక వడ్డీ ఇప్పిస్తానంటూ కొంతమంది టాలీవుడ్‌ సెలబ్రిటీలతో పాటు పలువురు వ్యాపారులను బురిడీ కొట్టించిన శిల్పా చౌదరి కేసులో రోజుకొక కొత్త కోణం వెలుగు చూస్తోంది. శిల్ప చౌదరి దాదాపు రెండువందల కోట్ల దాకా మోసం చేసినట్లు తెలుస్తోంది. దివ్యరెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో శిల్ప చౌదరిపై కేసు నమోదు చేసిన రంగంలోకి దిగారు పోలీసులు. శిల్పను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శిల్ప చౌదరిని (Shilpa Chowdary) రెండు రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు ఉప్పర్‌పల్లి కోర్టు (Upparpalli Court) అనుమతించడంతో చంచల్‌గూడ జైలు నుంచి నార్సింగి స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్ ఆమెను పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చింది. శుక్రవారం మొదటి రోజు విచారణ సాగింది. ఇక శనివారం కూడా పలు కోణాల్లో శిల్పను పోలీసులు విచారించారు. శిల్పా చౌదరి చీటింగ్‌ కేసులో (Shilpa Chaudhary cheating case) రోజుకొక కీలక విషయం బయటకు వస్తుంది. 

ఇప్పటికే సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు సోదరి (Mahesh Babu's sister) .. హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని (Priyadarshini) తాను శిల్పా చౌదరి చేతిలో మోసపోయానంటూ ఫిర్యాదు చేసింది. అలాగే సెహరి మూవీ హర్ష కూడా శిల్ప మాయమాటలు నమ్మి బోల్తా పడ్డాడు. శిల్ప ఫోన్‌ కాల్‌ డేటా, వాట్సాప్‌ చాటింగ్‌లు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్ల ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే చాలా మంది బ్లాక్‌మనీని వైట్‌ చేసుకునేందుకు తనకు పెట్టుబడి రూపంలో డబ్బు ఇచ్చారంటూ శిల్ప చెప్పిన విషయం తెలిసిందే. ఇంకొందరు అధిక వడ్డీకి ఆశపడి అప్పుగా ఇచ్చారంటూ శిల్ప పోలీసులకు చెప్పింది. 

Also Read :Mob Lynching: పాక్‌లో శ్రీలంకన్ దారుణ హత్య-నడిరోడ్డుపై కొట్టి చంపి,కాల్చేశారు

శనివారం విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. శిల్పా చౌదరిని నార్సింగ్‌ పోలీసులు ఇవాళ కూడా ప్రశ్నించారు. పలువురి నుంచి తీసుకున్న డబ్బును ఏం చేశావని శిల్పను పోలీసులు ప్రశ్నించారు. అయితే తన వద్ద రాధిక (Radhika) అనే మహిళ డబ్బులు తీసుకుందని శిల్ప చెప్పినట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా రాధికకు (Radhika) డబ్బులు ఇచ్చానని శిల్ప చెప్పినట్లు సమాచారం. అయతే రాధిక తిరిగి తనకు డబ్బులు ఇవ్వకపోవడంతో తాను భారీగా నష్టపోయానని శిల్ప పోలీసులకు (Of the police) చెప్పిందట. 

గండిపేట సిగ్నేచర్‌ విల్లాలోని (Signature Villa) శిల్ప చౌదరి ఇంటికి.. పోలీసులు ఆమెను తీసుకెళ్లి సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే తనకు ఎవరికీ డబ్బులు ఎగ్గొట్టాలనే ఉద్దేశం లేదంటూ శిల్ప పోలీసుల ఎదుట వాపోయిందట. ఇక శిల్ప (Shilpa Chowdary) చెప్పిన విధంగా.. రాధికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.

శిల్ప పలువురు ప్రముఖుల నుంచి రూ.200 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు పోలీసులకు ఇప్పటి వరకు ముగ్గురే ఫిర్యాదు చేశారు. బ్లాక్ మనీని.. వైట్‌గా మార్చుకునేందుకే కొందరు శిల్పాచౌదరిని వినియోగించుకున్నారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక రెండు రోజుల పోలీస్‌ కస్టడీ (Police custody) ముగియడంతో శిల్ప చౌదరిని (Shilpa Chowdary) ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు.

Also Read : Shubman Gill: హెన్రీ నికోల్స్ భారీ షాట్.. శుభ్‌మాన్ గిల్‌కు గాయం! ఓపెనర్‌గా పుజారా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News