Hyderabad Metro Rail: జస్ట్ రూ. 59తో హైదరాబాద్ మెట్రోలో ఇక అన్‌లిమిటెడ్ ట్రావెలింగ్

Hyderabad Metro Rail: హైదరాబాద్, 22 సెప్టెంబర్ 2023: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మరో గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ మెట్రో రైలు తమ ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడం కోసం సూపర్ సేవర్ - 59 ఆఫర్ (SSO-59)ని తిరిగి మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

Written by - Pavan | Last Updated : Sep 23, 2023, 05:43 AM IST
Hyderabad Metro Rail: జస్ట్ రూ. 59తో హైదరాబాద్ మెట్రోలో ఇక అన్‌లిమిటెడ్ ట్రావెలింగ్

Hyderabad Metro Rail: హైదరాబాద్, 22 సెప్టెంబర్ 2023: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మరో గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ మెట్రో రైలు తమ ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడం కోసం సూపర్ సేవర్ - 59 ఆఫర్ (SSO-59)ని తిరిగి మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. 23 సెప్టెంబర్ 2023 నుండి, హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణీకులందరూ లిస్టెడ్ సూపర్ సేవర్ సెలవు దినాలల్లో రూ.99 (అంతకుముందు SSO-99 ఆఫర్)కి బదులుగా కేవలం రూ.59తో మెట్రోలో అపరిమితంగా ప్రయాణించవచ్చు.
  
ఈ అద్భుతమైన ఆఫర్‌ను పొందేందుకు ప్రయాణికులు తాము గతంలో  కొనుగోలు చేసిన మెట్రో హాలిడే కార్డ్‌ని ఉపయోగించవచ్చు లేదా రూ.100తో కొత్త మెట్రో హాలిడే కార్డ్‌ని కొనుగోలు చేయవచ్చు. ఈ అద్భుతమైన ఆఫర్‌ను పొందేందుకు మెట్రో స్టేషన్‌లోని టికెట్ కౌంటర్ నుండి సూపర్ సేవర్ హాలిడేస్‌లో కేవలం రూ.59తో రీఛార్జ్ చేసుకోవచ్చు. 31 మార్చి 2024 వరకు జాబితాయలలో ఉన్న అన్ని సూపర్ సేవర్ సెలవు దినాలలో ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది.

ఈ ఆఫర్‌కి సంబంధించిన పూర్తి సమాచారం కోసం, దయచేసి www.ltmetro.com వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా ఏదైనా మెట్రో స్టేషన్‌ని సందర్శించండి అంటూ హైదరాబాద్ మెట్రో రైలు నిర్వాహణ సంస్థ అయిన ఎల్ అంట్ టీ విజ్ఞప్తి చేసింది. 

ఉద్యోగ రీత్యా రాకపోకలు సాగించినా లేదా నగర అందాలను వీక్షించటానికైనా.. ఇలా అవసరం ఏదైనా.. హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించిన ప్రయాణీకులందరికీ సరసమైన రీతిలో, వినూత్నమైన పద్ధతిలో గొప్ప అనుభూతిని అందించడం ద్వారా ప్రయాణికుల అంచనాలను అధిగమించేందుకు మెట్రో రైల్ ప్రయత్నిస్తోంది అని ఎల్ అంట్ టి తమ ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా నగరవాసులు, మెట్రో రైలు ప్రయాణికులు హైదరాబాద్ మెట్రో రైలును తమ తొలి ప్రాధాన్యత ఎంచుకున్నందుకు వారికి కృతజ్ఞత తెలిపే ఒక మార్గంగా ఈ ఆఫర్ ని అందిస్తున్నట్టు ఎల్ అంట్ టి స్పష్టంచేసింది.

Trending News