Hyd Metro 2nd Phase: తెలంగాణలోని ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మెట్రో రెండవ దశకు గ్రహణం పట్టింది. రెండవ దశ డీపీఆర్ ఇంకా ఆమోదం పొందకపోవడంతో ప్రాజెక్టుపై నీలినీడలు అలముకుంటున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కొర్రీలు, రాష్ట్ర ప్రభుత్వం జాప్యం కారణంగా ప్రాజెక్టు ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కన్పించడం లేదు.
హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం ఏ దశలో ఉందో కోరుతూ హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్ట్ ఒకరు ఆర్టీఐకు దరఖాస్తు చేయగా కేంద్ర కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ స్పందించింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రెండవ దశ ప్రతిపాదనలోనే ఉందని 2023-24 బడ్జెట్‌లో ఎలాంటి నిధుల కేటాయింపు జరపలేదని, 60 శాతం రుణం కోసం ఏజెన్సీ ఎంపిక ప్రక్రియ జరగలేదని స్పష్టం చేసింది. హైదరాబాద్ మెట్రో రెండవ దశ బీహెచ్‌ఈఎల్ నుంచి లక్ఢీకాపూల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్‌బి నగర్ వరకూ 5 కిలోమీటర్లు ప్రతిపాదన డీపీఆర్‌ను 8453 కోట్ల ఖర్చుతో డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది రాష్ట్ర ప్రబుత్వం. అయితే కేవలం సమన్వయలోపం కారణంగా మూడేళ్లు ఈ ప్రతిపాదన మూలనపడింది. ఆ తరువాత 2022 డిసెంబర్ 1న కీలకమైన 15 అంశాలపై వివరణ కోరింది కేంద్ర ప్రభుత్వం.
దీనిపై యధావిధిగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంపై విమర్శలు చేశారు. డీపీఆర్ ఆమోదించమని కోరుతూ కేంద్ర మంత్రి హరిదాస్ సింగ్ పూరికి లేఖ రాసినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చెప్పారు. కేంద్ర అడిగిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 28 వతేదీన, తిరిగి ఆగస్టు 8వ తేదీన సమర్పించింది. 2031 నాటికి బీహెచ్‌ఈఎల్-లక్డీకాపూల్ పీక్ అవర్ పీక్ డైరెక్షన్ డిస్ట్రిక్ 21260కు, 2041 నాటికి 31240కు, 2051 నాటికి 36873కు చేరుతుందని అంచనా ఉంది. ప్రతిపాదిత బీహెచ్‌ఈఎల్ కారిడార్ కంటే తక్కువ పీక్ అవరర్ పీక్ డైరెక్షన్ డిస్ట్రిక్ట్ ఉన్న మెట్రోలకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నగరాల్లో అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వం అడిగిన 9 నెలలకు పంపించింది. కంటింజెన్సీ నిమిత్తం 3 శాతం ఛార్జీలకై ఏర్పాటు చేయాల్సిన అర్బన్ ట్రాన్స్ పోర్ట్ ఫండ్‌ను హెచ్‌ఎండీఏ కింద జూలై 2023లో ఏర్పాటు చేసిన లేఖ పంపించింది.
మొత్తానికి సమగ్రమైన డీపీఆర్ పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరోసారి కొర్రీలు విధిస్తే రాష్ట్రం ఎప్పటికి సమాధానమిస్తుందో తెలియని పరిస్థితి. హైదరాబాద్ మెట్రో రెండవ దశ త్వరగా పూర్తి కాకుంటే 8453 కోట్ల అంచనా కాస్తా 15 వేల కోట్లు కానుంది. బీహెచ్‌ఈఎల్-లక్డీకాపూల్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం భూమితోపాటు 17 శాతం మూలధనం సమకూర్చాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం 17 శాతం వాటా మూలధనంగా, 3 శాతం డెట్ భిరిస్తుంది. అంటే ప్రాజెక్టు వ్యయం 8453 కోట్లకు అదనంగా 1067 కోట్లు , ఇంకో 188 కోట్లు వచ్చి చేరనున్నాయి. రుణంలో భాగంగా 3767 కోట్లు పిపిపి ప్రాజెక్టు సంస్థ 248 కోట్లు చెల్లించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook