Hyderabad Road Accident: హైదరాబాద్‌- శ్రీశైలం హైవే పై ఘోరం.. ముగ్గురి మృతి..

Hyderabad Road Accident: హైదరాబాద్‌- శ్రీశైలం హైవేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురి ప్రాణాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో శ్రీశైలం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Written by - Renuka Godugu | Last Updated : May 24, 2024, 09:42 AM IST
Hyderabad Road Accident: హైదరాబాద్‌- శ్రీశైలం హైవే పై ఘోరం.. ముగ్గురి మృతి..

Hyderabad Road Accident: హైదరాబాద్‌- శ్రీశైలం హైవేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురి ప్రాణాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో శ్రీశైలం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి...

ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం అయ్యసాగర్‌లో చోటుచేసుకుంది. అయితే, వివరాల ప్రకారం రామంత గడ్డ సమీపంలోని శ్రీశైలం హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు అతి వేగంతో ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, ఈ ప్రమాదం కారు డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండటం వల్లే జరిగిందని తెలుస్తోంది. మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా ఆరో విడత ఎన్నికల ప్రచారం పూర్తి.. 58 స్థానాలకు రేపే పోలింగ్..

ఈ కారు కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.  అయితే, శ్రీ శైలం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును డ్రైవర్‌ నిద్ర మత్తులో ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో కారులో ఉన్నవారు అక్కడిక్కడే మృత్యువాత చెందారు. వీరంతా కారులోనే చిక్కుకున్నారు. స్థానికులు, పోలీసుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. జేసీబీ సాయంతో బయటకు తీశారు. ప్రస్తుతం పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగం, నిద్ర మత్తు యాక్సిడెంటుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఇదీ చదవండి:  శ్రీధర్‌ రెడ్డి హత్యపై కేటీఆర్‌ ఫైర్‌.. ఇలాంటివి మళ్లీ జరిగితే రేవంత్‌ రెడ్డి తట్టుకోలేవు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News