నోట్లో హిట్ కొట్టి భర్తను చంపేసింది!

కుటుంబకలహాలతో విసిగి వేసారిపోయిన ఓ భార్య భర్తను నోట్లో హిట్ కొట్టి చంపేసింది.

Updated: Aug 10, 2018, 04:37 PM IST
నోట్లో హిట్ కొట్టి భర్తను చంపేసింది!

కుటుంబకలహాలతో విసిగి వేసారిపోయిన ఓ భార్య భర్త నోట్లో హిట్ కొట్టి చంపేసింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో సోమవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాకు చెందిన దేవిక, జగన్‌లకు 9 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరు నగరంలోని ఫిల్మ్ నగర్‌లో గతకొంత కాలంగా నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం కూడా ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో విసిగిపోయిన భార్య.. భర్త మద్యం మత్తులో ఉండగా నోటిలో దోమలు, ఈగలను చంపేందుకు వాడే హిట్ కొట్టింది. మత్తు వదిలి దాహం.. దాహం అంటూ అరచిన భర్త జగన్ ఆపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించాడు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితురాలు దేవికను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.