Hydra ranganath clarity over allegations: తెలంగాణలో హైడ్రా పేరు చెప్తేనే అక్రమ కట్టడాలు చేపట్టిన వారికి గుండెల్లో రైళ్లుపరిగెడుతాయని చెప్పుకొవచ్చు.కొన్ని నెలల క్రితం వీకెండ్ వచ్చిందంటే.. ఎక్కడ కూల్చివేతలు ఉంటాయోనని జనాలు తెగ భయపడిపోయేవారు. సీఎం రేవంత్ సైతం హైడ్రా కాన్సెప్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే.. హైడ్రా కూల్చివేతలపై ప్రజల నుంచి భారీగా నిరసనలు వచ్చాయి. హైకొర్టు సైతం హైడ్రాకు, ప్రభుత్వానికి పలు సందర్భాలలో మొట్టికాయలు సైతం వేసింది. దీంతో ప్రస్తుతం హైడ్రా కాస్తంతా వెనక్కి తగ్గినట్లు తెలుస్తొంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం ఉంటున్న ఇల్లు బఫర్ జోన్ లో ఉందని ఇటీవల కొన్ని మీడియాల్లో, సోషల్ మీడియాలలో కథనాలు వచ్చాయి. దీంతో సామాన్య ప్రజలకు ఒక న్యాయం.. అధికారులకు మరొ న్యాయమా.. అంటూ సోషల్ మీడియాలో జనాలు ఏకీ పారేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిపై తాజాగా స్పందించారు. తాను.. నివాసం ఉంటున్న ఇల్లుపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తొంది.
ఈ క్రమంలో హైడ్రా రంగనాథ్ మాట్లాడుతూ.. హైదరబాద్ లోని.. మధురా నగర్లో మేము నివాసం వుంటున్న ఇళ్లు 4 దశాబ్దాల క్రితం మా నాన్నగారు నిర్మించిందని క్లారిటీ ఇచ్చారు. కృష్ణకాంత్ పార్కు దిగువునచాలా నిర్మాణాల తర్వాత తమ ఇల్లు ఉందని చెప్పుకొచ్చారు. ఒకప్పటి పెద్ద చెరువునే.. రెండున్నర దశాబ్దాల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. చెరువు కట్టకు దిగువున10 మీటర్లు దాటితే.. కిందన వున్న నివాసాలు ఇరిగేషన్ నిబంధనల మేరకు బఫర్ జోన్ పరిధిలోకి రావన్నారు. తమ ఇల్లు..కట్టకు దాదాపు కిలో మీటర్ దూరంలో ఉందన్నారు.
Read more: TGPSC Group-2: తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ షాక్.... మరోసారి గ్రూప్-2 వాయిదా.. ?.. కారణం ఏంటంటే..?
మా నాన్న శ్రీ ఎ.పి.వి.సుబ్బయ్య గారు 1980 సంవత్సరంలో మేము వుంటున్న యింటిని నిర్మించరని అన్నారు. 44 ఏళ్ల క్రితం నిర్మించిన అదే ఇంట్లో మా తండ్రితో కలిసి ఉంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తమ నివాసం బఫర్ జోన్ లో లేదని, వాస్తవాలు తెలుసుకొవాలని చెబుతూ... ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా పరిశీలించాలని కోరుతున్నట్లు హైడ్రా రంగనాథ్ క్లారిటీఇచ్చినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter