ప్రజా సమస్యలపై పోరాడేందుకు తెలంగాణ గడ్డపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అడుపెట్టారు. చలోరే చలోరే చల్ పేరుతో మూడు రోజుల పాటు ప్రజాయత్ర చేపట్టాలని ఆయన సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ సోమవారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ ఆలయ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించించారు. అనంతరం కరీనగర్ పయనమై.. స్థానిక జనసేన ప్రతినిధులు, కార్యకర్తలతో సమావేశమౌతారు.
పవన్ రియాక్షన్ పై సర్వత్రా ఆసక్తి..
చలోరే చలోరే చల్ తన యాత్రలో పవన్ ఎలాంటి వ్యాఖ్యాలు చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీపై తన స్టాండ్ ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. గతంలో పవన్ కల్యాణ్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు అనుకూల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ పర్యటనకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు. అయితే పవన్ తన స్టాండ్ గురించి ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. దీంతో తెలంగాణలో ఆయన పొలిటికల్ స్టాండ్ ఎలా ఉండబోతోందనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.