Munugode Bypoll: నిద్రలేని రాత్రులు గడుపుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎందుకో తెలుసా?

Munugode Bypoll: మునుగోడు నియోజకవర్గాన్ని మొత్తం 86 క్లస్టర్లుగా విభజించి ఇంచార్జులను నియమించారు. 14 మంది మంత్రులు, 72 మంది ఎమ్మెల్యేలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ఎంపీటీసీ పరిధికి ఒక్కో ఎమ్మెల్యేను ఇంచార్జ్ గా నియమించారు. మంత్రులను కూడా ఎంపీటీసీ పరిధి వరకే పరిమితం చేశారు.

Written by - Srisailam | Last Updated : Oct 20, 2022, 11:59 AM IST
  • మునుగోడులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మకాం
  • లీడ్ రాకుంటే వచ్చే ఎన్నికల్లో నో టికెట్
  • గులాబీ లీడర్లకు నిద్రలేని రాత్రులు!
Munugode Bypoll: నిద్రలేని రాత్రులు గడుపుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎందుకో తెలుసా?

Munugode Bypoll: తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలుస్తోంది. కొంత మంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అంటున్నారు. తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందన్న భయంతో వాళ్లకు నిద్ర రావడం లేదట. గులాబీ పార్టీ లీడర్లకు నిద్రలేకుండా పోవడానికి కారణం ఏంటో తెలుసా.. మునుగోడు ఉప ఎన్నికే. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికే ఇప్పుడు అధికార పార్టీ లీడర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్ని సవాల్ గా తీసుకున్నాయి. దుబ్బాక, హుజురాబాద్ ఓటములతో షాకైన అధికార పార్టీకి మునుగోడు అతిపెద్ద సవాల్ గా మారింది. మునుగోడుతో హ్యాట్రిక్ కొడితే వచ్చే ఎన్నికల్లో తమకు తిరుగుండదని భావిస్తున్న కమలం పార్టీ అస్త్రశస్త్రాలతో టీఆర్ఎస్ కు చెమటలు పట్టిస్తోంది. బలమైన రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిగా ఉండటంతో కారు పార్టీకి ఉప ఎన్నిక గండంగా మారింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడమే లక్ష్యమంటున్న సీఎం కేసీఆర్.. పార్టీ నేతలందరిని మునుగోడులోనే మోహరించారు. మునుగోడు నియోజకవర్గాన్ని మొత్తం 86 క్లస్టర్లుగా విభజించి ఇంచార్జులను నియమించారు. 14 మంది మంత్రులు, 72 మంది ఎమ్మెల్యేలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ఎంపీటీసీ పరిధికి ఒక్కో ఎమ్మెల్యేను ఇంచార్జ్ గా నియమించారు. మంత్రులను కూడా ఎంపీటీసీ పరిధి వరకే పరిమితం చేశారు. ప్రచార గడువు ముగియే వరకు ఎవరికి కేటాయించిన గ్రామాల్లోనే వారు ఉండాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయంటున్నారు.

తమకు కేటాయించిన గ్రామాల్లోనే జోరుగా ప్రచారం చేస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. అక్కడే ఇంటిని చూసుకుని ఉంటున్నారు. తమ నియోజకవర్గ పరిధిలోని నేతలను తీసుకొచ్చి ప్రచారం చేయిస్తున్నారు. వంద ఓటర్లకో ఇంచార్జ్ ను పెట్టుకుని ప్రతి రోజు ఓటర్లను కలుస్తున్నారు.మంత్రులు సైతం చిన్నచిన్న గల్లీలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. గల్లీ స్థాయి లీడర్ తోనూ చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న మునుగోడు ఓటర్లకు నేరుగా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు వస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించనవచ్చు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంతగా కష్టపడటానికి కారణం సీఎం కేసీఆర్ పెట్టిన కండీషనే. తమకు కేటాయించిన గ్రామంలో పార్టీకి లీడ్ తగ్గితే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని కేసీఆర్ క్లారిటీగా చెప్పేశారట నేతలకు. తమ పరిధిలోని గ్రామంలో ఓటింగ్ శాతం పెంచడంతో పాటు లీడ్ రావాల్సిందేనని స్పష్టం చేశారట. మంచి లీడ్ తీసుకొచ్చిన వారికి భవిష్యత్, పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని  తేల్చి చెప్పారట. దీంతో లీడ్ సాధించి తమ సీటును కాపాడుకోవడంతో పాటు మంచి ఓట్లు తీసుకొచ్చి సీఎం కేసీఆర్ దృష్టిలో పడాలని కొందరు ఎమ్మెల్యేలు బాగా కష్టపడుతున్నారని అంటున్నారు.

అయితే పార్టీకి సానుకూల వాతావరణం ఉన్న గ్రామాలకు ఇంచార్జులుగా ఉన్న ఎమ్మెల్యేలు ఖుషీగా ఉండగా.. పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతంలో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేలు కలవరానికి గురవుతున్నారని తెలుస్తోంది. పార్టీకి లీడ్ రాకుంటే తనకు ఎక్కడ ఎసరు వస్తుందోనన్న భయంతో వణికిపోతున్నారట గులాబీ లీడర్లు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ లో ఓటమి తర్వాత పోస్ట్ మార్టమ్ నిర్వహించిన కేసీఆర్.. ఓట్లు తక్కువగా వచ్చిన పోలింగ్ కేంద్రాలకు ఇంచార్జులుగా ఉన్న నేతలపై సీరియస్ అయ్యారని చెబుతున్నారు. మునుగోడును హుజురాబాద్ కంటే సీరియస్ గా తీసుకోవడంతో  ముఖ్యమంత్రి మరింత కఠినంగా ఉండవచ్చనే ఆందోళన కారు పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఎలాగైన తన పరిధిలో లీడ్ తెచ్చేందుకు కొందరు ఎమ్మెల్యేలు భారీగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. చౌటుప్పల్ మండలం ఆరగూడెం ఇంచార్జుగా ఉన్న మంత్రి మల్లారెడ్డి.. ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నిక కారు పార్టీ లీడర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Read Also: Viral: స్మార్ట్‌ఫోన్‌ కొనడం కోసం తన రక్తాన్ని అమ్మకానికి పెట్టిన 16ఏళ్ల బాలిక

Read Also: Dream 11 Winner: డ్రీమ్ 11తో జాక్ పాట్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన గిరిజనుడు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News