అది ..కోదండరాం ఉనికి కోసం కొట్లాట - డిప్యూటీ సీఎం కడియం

ప్రొఫెసర్ కోదండారంపై తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కౌంటర్ ఎటాక్ చేశారు.

Last Updated : Dec 4, 2017, 08:28 PM IST
అది ..కోదండరాం ఉనికి కోసం కొట్లాట - డిప్యూటీ సీఎం కడియం

హైదరాబాదాద్: కోదండారం చేస్తున్న కోట్లాట కొలవుల కోసం కాదని..ఆయన ఉనికి కోసమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు.  ‘కొలువులకై కొట్లాట’ పేరుతో నిరుద్యోగులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. తమ ప్రభుత్వం 8 వేలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని..ఆయా పోస్టుల‌ను హైకోర్టు ఆదేశాల మేరకు 10 జిల్లాల వారీగా విభజించామ‌ని తెలిపారు. టీఎస్‌పీఎస్‌సీకి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పంపుతున్నామ‌ని.. దీనిపై కూడా త్వరలో నోటిఫికేషన్‌ విడుదలవుతుందని అన్నారు. 

ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి క‌డియం శ్రీహ‌రి పేర్కొన్నారు.  హైద‌రాబాద్‌లోని స‌రూర్‌న‌గ‌ర్‌లో టి జేఏసీ ఛైర్మన్ కోదండరాం ఈ రోజు ‘కొలువులకై కొట్లాట’ సభ నిర్వహించిన తెలిసిందే. ఈ సభలో కోదండారం టి సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆయనపై ఇలా ఎదురుదాడి దిగారు

Trending News