పంచాయితీ ఎన్నికలతో మంత్రివర్గానికి ముడిపెట్టిన కేసీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన కేసీఆర్ ఇప్పుడు పంచాయితీ ఎన్నికలపై గురిపెట్టారు

Last Updated : Dec 12, 2018, 07:34 PM IST
పంచాయితీ ఎన్నికలతో మంత్రివర్గానికి ముడిపెట్టిన కేసీఆర్

ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారు. ఈ క్రమంలో గురువారం తెలంగాణ సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా తిరిగి మంత్రి పదవి కోసం గత మాజీలు ప్రయత్నాలు చేస్తుంటే..మరోవైపు రేసులో మేమున్నాంటూ మరికొందరు ఆశావహులు ముందుకు వస్తున్నారు. దీంతో మంత్రి పదవి ఆశిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 

ఆశావహులు ఎందురు ఉన్నప్పటికీ కేసీఆర్ మాత్రం బుల్లి కెబినెట్ తో ప్రభుత్వాన్ని నడపాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు దశల్లో మంత్రు పదవులు ఉంటాయని కేసీఆర్ ఇచ్చిన ప్రకటన దీనికి మరింత బలాన్ని చేకూర్చుతోంది. తొలి దశలో పార్టీలో కీలకంగా ఉన్న వారికి కేబినెట్ లో తీసుకొని..మిగిలిన వారికి త్వరలో నిర్వహించతలపెట్టిన పంచాయితీ ఎన్నికల్లో తమ తమ నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు సాధించిన వారికి ప్రాధ్యనం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు రాజకీయావర్గాలు గుజగుజలాడుకుంటున్నాయి. అందుకే ఆయన ప్రెస్ మీట్ లో పంచాయితీ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారని కొందరు వాదిస్తున్నాయి.

Trending News