సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టిన కేసీఆర్ !!

Telangana Elections 2018: ఆదిలాబాద్ సభలో మోడీ సర్కార్ పై కేసీఆర్  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

Last Updated : Nov 29, 2018, 08:03 PM IST
సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టిన కేసీఆర్ !!

ఆదిలాబాద్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మరోసారి ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణలో గిరిజనులు,ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామన్నారు.ఈ సందర్భంగా రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కేసీఆర్ తప్పుపట్టారు. రాజ్యాంగంలో ఎక్కడా 50 శాతం కంటే మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదని లేదన్నారు.

రిజర్వేషన్లు కేటాయించడం అనేది కేంద్ర ప్రభుత్వ పరధిలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తలచుకుంటూ రిజర్వేషన్లు వచ్చి తీరుతాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.  కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్లే తామ ఇవ్వదల్చుకున్న రిజర్వేషన్లు సాధ్యంకాడం లేదన్నారు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ వస్తేకానీ రిజర్వేషన్లు సాధపడదని..ఈ ప్రయత్నంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గిరిజనల జనాభా శాతం 6 నుంచి 10 శాతం వరకు పెరిగిందని..అలాగే ముస్లింల జనాభా 12 నుంచి 13 శాతం పెరిగిందన్న కేసీఆర్.. జానాభా ప్రాతిపాదికన ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయిం తీసుకున్నామని కేసీఆర్ వివరించారు. ఈ సారి అధికారంలోకి వచ్చాక తప్పకుండా గిరిజనలు, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి తీరుతామని కేసీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
 

Trending News