Telangana: కొత్త సచివాలయంలో ఆలయం, మసీదు నిర్మిస్తాం: కేసీఆర్

హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించనున్న తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ఆలయం, మసీదులను ప్రభుత్వం (Telangana Govt) తరపున నిర్మించి సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) శుక్రవారం ప్రకటించారు. 

Last Updated : Jul 10, 2020, 05:15 PM IST
Telangana: కొత్త సచివాలయంలో ఆలయం, మసీదు నిర్మిస్తాం: కేసీఆర్

CM KCR: హైదరాబాద్: హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించనున్న తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో ఆలయం, మసీదులను ప్రభుత్వం (Telangana Govt) తరపున నిర్మించి సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) శుక్రవారం ప్రకటించారు. సచివాలయ భవనాల కూల్చివేతతో ఆలయం, మసీదుకు నష్టం జరిగిందని, ఇలా జరగడం పట్ల చింతిస్తున్నామని ఆయన విచారం వ్యక్తంచేశారు. ఇది అనుకోకుండా జరిగిందని, అందరూ అర్థం చేసుకోవాని ఆయన కోరారు. ఎన్ని కోట్లయినా వెనుకాడకుండా ఆలయం, మసీదును ప్రభుత్వం నిర్మించి ఇస్తుందని, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశ్యం కాదని కేసీఆర్ స్పష్టంచేశారు. Also read: సచివాలయం కూల్చివేత పనులకు హైకోర్టు బ్రేకులు

నల్లపోచమ్మ ఆలయం, మసీదు నిర్వాహకులతో తానే స్వయంగా సమావేశమై, వారి అభిప్రాయాలు తీసుకోని కొత్తసచివాలయంతోపాటుగా వాటిని కూడా ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ సెక్యులర్ ప్రాంతమని ఎట్టిపరిస్థితుల్లో కూడా ఆ లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తామని స్పష్టంచేశారు. Also read: Telangana: ఫెయిలైన విద్యార్ధులు కూడా పాస్

ఇదిలా ఉంటే కేసీఆర్ ప్రకటన పట్ల తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తంచేసింది. సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు, పనుల కోసం వచ్చే ప్రజలకు ఆలయం, మసీదు ఎంతో భరోసానూ, నమ్మకాన్ని కలిగిస్తాయని టీఎన్జీవోఏ పేర్కొంది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

Trending News