సచివాలయం కూల్చివేత పనులకు హైకోర్టు బ్రేకులు

TS High Court On Secratariat demolition | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనులకు హైకోర్టు బ్రేకులు వేసింది. సచివాలయ భవనాల కూల్చివేతల్ని నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు సచివాలయం కూల్చివేతపై ప్రతిపక్షాలతో పాటు ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Last Updated : Jul 10, 2020, 01:21 PM IST
సచివాలయం కూల్చివేత పనులకు హైకోర్టు బ్రేకులు

Telangana Secratariat Demolition | సచివాలయ భవనాల కూల్చివేత పనులు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు (TS high Court) ఆదేశించింది. కూల్చివేత పనులను సోమవారం వరకు ఆపివేయాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం సెక్రటేరియల్ భవనాల కూల్చివేత పనులు కొనసాగిస్తోంది.

ఈ క్రమంలో సచివాలయం కూల్చివేత పనులు నిలిపివేయాలని హైకోర్టులో పి.ఎల్. విశ్వేశ్వరరావు ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. సచివాలయం కూల్చివేతపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos

 

Trending News