కేసీఆర్ నామినేషన్‌కి ముహూర్తం ఖరారైందా ?

కేసీఆర్ నామినేషన్‌కి ముహూర్తం ఖరారైందా ?

Last Updated : Nov 10, 2018, 09:54 PM IST
కేసీఆర్ నామినేషన్‌కి ముహూర్తం ఖరారైందా ?

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నామినేషన్ దాఖలుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం 2014 ఎన్నికల్లో పోటీచేసిన గజ్వేల్ నియోజకవర్గం నుంచే ఈసారి కూడా పోటీకి దిగేందుకు నిర్ణయంచుకున్న కేసీఆర్.. ఈ నెల 14వ తేదీ, బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నట్టు సమాచారం. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కేసీఆర్ గజ్వేల్‌లోనే ఓ భారీ బహిరంగసభను నిర్వహించి అక్కడి నుంచే తన నియోజకవర్గ ప్రచారాన్ని చేపట్టనున్నారని మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. 

గజ్వెల్‌లో కేసీఆర్ సభ కోసం మరోవైపు ఏర్పాట్లు సైతం జరుగుతున్నట్టు వినికిడి. అయితే, దీనిపై కేసీఆర్ నుంచి కానీ లేదా అటు పార్టీ వర్గాల నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం.

Trending News