KTR Comments On CM Revanth Reddy: కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది?: కేటీఆర్

KTR Comments On CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎండగట్టారు.

Written by - Renuka Godugu | Last Updated : May 24, 2024, 04:32 PM IST
KTR Comments On CM Revanth Reddy: కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది?: కేటీఆర్

KTR Hot Comments On CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో జరిగిన పార్టీ సన్నాహాక సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. రైతులను దగా చేసిన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా? ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. ముఖ్యంగా రైతులకు రైతు భరోసా ఇస్తా అని మోసం చేసిన 420 అని రేవంత్‌ రెడ్డిపై ఫైర్ అయ్యారు. అంతేకాదు మహిళలకు రూ. 2500 ఇస్తామన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మాత్రం మహాలక్ష్మి ప్రొగ్రాం తెలంగాణలో స్టార్ట్ అయ్యిందని చెబుతున్నారు. అది కూడా మోసం ఆరు గ్యారంటీల్లో ఐదు అయిపోయాయి అన్నారు కానీ, అందులో కేవలం ఫ్రీ బస్సు మాత్రమే అమలు అయింది అది కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. 

ఒక రైతులను, మహిళలను మాత్రమే కాదు కాంగ్రెస్‌ ప్రభుత్వం అందరికీ ఈస్ట్‌ మాన్ కలర్‌ సినిమా చూపించింది దీంతో ప్రజలు నమ్మారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిన 420 రేవంత్ రెడ్డి. కానీ, ఆయన ఇచ్చింది గాడిద గుడ్డు. నోటిఫికేషన్‌ వేయలేదు రాతపరీక్ష లేదు కేసీఆర్‌ ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగాలకు ఆయన వచ్చి పేపర్లు ఇచ్చిండు. అందుకే రెండు లక్షల ఉద్యోగాలు ఏవీ? అని అడగాలంటే అక్కడ ఎవరు ఉండాలి? మెగా డీఎస్సీ వేస్తానన్నారు. ఈరోజు ఏమైంది అని అడగాలి కదా.. ఈ ఎన్నికలు వాళ్లు ఓడిపోయినా ఏం కాదు. కానీ, మనం ఓడిపోతే అడిగేవారు ఉండరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే వాళ్లకు ఝలక్ ఇచ్చినట్టు అవుతుంది. హామీలు నిలుపుకోకపోతే గద్దె దింపుతామని హెచ్చరించినట్లవుతుందన్నారు కేటీఆర్‌.

ఆ సమావేశంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? అని ప్రశ్నించారు. ఆరు నెలల క్రితమే చెప్పాం కాంగ్రెస్‌ వస్తే మోసపోతం, ఘోస పడతాం అని అరచేతిలో వైకుంఠం చూపించడంతో ప్రజలు మోసపోయారు. పాలిచ్చే బర్రెను కాదని పొడిచే దున్నపోతును తెచ్చుకున్నట్లు అయ్యింది. దేవుని మీద ఒట్టు వేసి రేవంత్ రెడ్డి రుణమాఫీ అంటున్నాడు. కానీ రుణమాఫీ అవుతుందా? లేదా? మీరే చూస్తారు.

అదే కేసీఆర్‌ అయితే లక్ష రుణమాఫీ చేసిన వారికి రూ. 2 లక్షలు డిసెంబర్ 9 రోజే రుణమాఫీ చేస్తా అన్నాడు. చాలా మంది ఆయన మాటలు నమ్మి కొత్తగా లోన్లు కూడా తెచ్చుకున్నారు. కానీ, ఆరునెలలు అవుతుంది రుణమాఫీ ఏదీ? అన్ని ప్రశ్నించారు. రైతులకు ఎంఎస్పీ రూ. 500 బోనస్ ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు మాత్రం సన్న వడ్లు పండిచే వాళ్లకే ఇస్తామని కేబినెట్ సమావేశం పెట్టి చెబుతున్నారు. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడి తప్పు. రెండో సారి కూడా మోసపోతే మోసపోయిన వాళ్లదే తప్పు. ప్రతిపక్షం కూడా బలంగా ఉంటేనే ప్రభుత్వం ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేస్తుందన్నారు.ఒక వైపు పదేళ్ల నిజమైన పాలన. మరొవైపు 150 రోజుల అబద్దపు మోసం పాలన అన్నారు. 

ఇదీ చదవండి: హైదరాబాద్‌- శ్రీశైలం హైవే పై ఘోరం.. ముగ్గురి మృతి..

అంతేకాదు కేసీఆర్ గారు నాట్లు వేసేటప్పుడు రైతుబంధు వేసేవారు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ఓట్లు వేసే నాడు రైతుబంధు గుర్తొస్తోందని కేటీఆర్‌ ఎద్దెవ చేశారు. తులం బంగారం, స్కూటీలు అన్నారు వచ్చినయా? అంతేకాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 60 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ లేదు. కానీ కేసీఆర్ గారు పదేళ్లలోనే మూడు మెడికల్ కాలేజులు తెచ్చారు. కేసీఆర్  యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి దేవస్థానాన్ని వెయ్యేళ్లు నిలిచిపోయేలా నిర్మించారు. యాద్రాద్రి లో పవర్ ప్లాంట్ ద్వారా 16 వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేసేలా చేశాం. ఎన్నో పనులు చేసినప్పటికీ తప్పుడు ప్రచారం కారణంగా స్వల్ప తేడాతో ఓడిపోయాం అన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్.

ఇదీ చదవండి: శ్రీధర్‌ రెడ్డి హత్యపై కేటీఆర్‌ ఫైర్‌.. ఇలాంటివి మళ్లీ జరిగితే రేవంత్‌ రెడ్డి తట్టుకోలేవు

ఇక బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి సామాన్య రైతుబిడ్డ. ఎంతో కష్టపడి బిట్స్ పిలానీలో సీటు తెచ్చుకొని గోల్డ్ మెడల్ సాధించాడు. అమెరికాలో ఏడేళ్లు ఉద్యోగం చేశాడు. చదువుకున్న గోల్డ్ మెడలిస్ట్ మన అభ్యర్థి.మరి కాంగ్రెస్ వాళ్ల అభ్యర్థి ఎవరు? అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసినందుకు,అనుమతి లేకుండా చాలా మంది  ఫోన్ నంబర్లు సోషల్ మీడియాలో పెట్టినందుకు ఆయన మీద 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంతేకాదు 74 రోజులపాటు చంచల్ గూడ జైల్లో ఉన్న అనుభవం ఉంది కూడా అన్నారు. ఇలాంటి వ్యక్తి గెలిస్తే రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి ప్రశ్నిస్తాడా? అన్నారు కేటీఆర్.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News