Hyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీ

Hyderabad Rain Live Updates  : జంట నగరాల వాసులకు జిహెచ్ఎంసి అలర్ట్ జారీ చేసింది. ఈ రాత్రి భారీ వర్షం కురుస్తుందని తన అలర్ట్ లో పేర్కొంది. ఇప్పటికే జిహెచ్ఎంసి సిబ్బందిని సైతం సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులు అలర్ట్ చేశారు.

Written by - Bhoomi | Last Updated : Aug 15, 2024, 09:10 PM IST
Hyderabad Rain Live Updates  :  హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీ
Live Blog

Hyderabad Rain Live Updates  :  హైదరాబాదులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశమంత మేఘావృతమై పలు ప్రాంతాల్లో జోరువాన కురుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే హైదరాబాదులో ఈ రాత్రి అంటే ఆగస్టు 15, గురువారం రాత్రి రెండు గంటల పాటు భారీ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో పలు ప్రాంతాల్లో వర్షం సాయంత్రం నుంచి దంచి కొడుతోంది. నేడు నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ , ఫిలింనగర్, యూసఫ్ గూడా, మధుర నగర్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్ వంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. రానున్న నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వాతావరణం రెండు రోజులుగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే జిహెచ్ఎంసి కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలను జారీ చేశారు.

ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని మ్యాన్ హోల్స్, అదేవిధంగా ఓపెన్ నాలాల వద్ద పౌరులు సంచరించకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ జాం కూడా విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. జిహెచ్ఎంసి ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే వెంటనే రంగంలో దిగి సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని కూడా అలాంటి చేసి ఉంచింది. ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా కూడా హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట. మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్ జిల్లాలలో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

15 August, 2024

  • 21:02 PM

    రాష్ట్రంలో రాగల 3 రోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

  • 20:48 PM

    హైదరాబాద్ లో కుండపోత వర్షంపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ స్పందించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్నప్తి చేశారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బ్రుందాలు రంగంలోకి దిగాయి. జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. 

  • 20:45 PM

    భారీ వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ 040-21111111/9000113667 అత్యవసరం అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు  ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. 

  • 20:44 PM

    హైదరాబాద్ కు ఆరేంజ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. హైదరాబాద్ నగరంలోపాటు పక్కన ఉన్న జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కుండపోత వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. 

  • 20:39 PM

    భారీ వర్షం కారణంగా జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. నగరంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు జారీ చేశారు. అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. రూడ్లపై ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని చెబుతున్నారు. 

  • 20:35 PM

    నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 87.0 మి. మీటర్ల వర్షపాతం నమోదు కాగా..హైదరాబాద్ నగరంలోని పత్తిగడ్డలో అత్యధికంగా 74.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.  బన్సీలాల్ పేటలో 73.0, రామచంద్రాపురం 68.5, ముషీరాబాద్ 67.0 కూకట్ పల్లిలో 64.8 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదు అయినట్లు హైదరాబాద్ లోని వాతావరణ శాఖ తెలిపింది. 

  • 20:32 PM

    సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా  93.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది.

  • 20:31 PM

    హుస్సేన్ సాగర్ నాలా పరిసర ప్రాంతాలైన దోమల్ గుడా, నారాయణ గూడ, కవాడి గూడ ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అలర్ట్ చేసింది..

  • 20:27 PM

    షాపూర్, జీడిమెట్ల, బాలానగర్, సుచిత్ర, సూరారం, కూకట్ పల్లి, అల్వీన్ కాలనీ, హైదర్ నగర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, జగద్గిరిగుట్ట, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, పారడైజ్, బేగంపేట్, చిలకలగూడ, మేడ్చల్, కండ్లకోయ ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం పడటంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

  • 20:26 PM

    జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, బాగ్ లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్ , సనత్ నగర్, మధురానగర్, ఈఎస్ఐ, ముషీరాబాద్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. 

  • 20:23 PM

    హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది.  సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రహదారిపై వర్షం నీరు చేరి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. 

  • 20:22 PM

    మూసి పారివాహిక ప్రాంతాల్లోని పలు ప్రదేశాల్లో భారీ వర్షం పడుతుంది. ముఖ్యంగా అత్తాపూర్, పురానా పూల్, చాదర్ ఘాాట్, మూసారాంబాగ్, నాగోల్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది.

  • 20:19 PM

    హైదరాబాదులోని తూర్పు ప్రాంతంలోని ఉప్పల్, రామంతపూర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, మలక్ పేట ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది.

Trending News