National Anthem: వరి నాట్లు వేస్తూ జనగనమణ.. జాతీయ గీతంతో మార్మోగిన తెలంగాణ

National Anthem Mass Singing: జయజయహే నినాదాలతో తెలంగాణ రాష్ట్ర మార్మోగింది. దేశ జాతీయ గీతం జనగణమనతో పులకించిపోయింది. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించింది

Written by - Srisailam | Last Updated : Aug 16, 2022, 02:07 PM IST
  • జనగనమణతో మార్మోగిన తెలంగాణ
  • జాతీయ గీతాలాపనతో పులకించిన జనం
  • వరినాట్లు వేస్తూ సెల్యూట్ చేసిన మహిళా కూలీలు
National Anthem: వరి నాట్లు వేస్తూ జనగనమణ.. జాతీయ గీతంతో మార్మోగిన తెలంగాణ

National Anthem Mass Singing: జయజయహే నినాదాలతో తెలంగాణ రాష్ట్ర మార్మోగింది. దేశ జాతీయ గీతం జనగణమనతో పులకించిపోయింది. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం అంచనాకు మించి విజయవంతమైంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలంతా ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఒకేసారి జాతీయ గీతం ఆలపించారు. ఆ సమయానికి ఎక్కడ ఉన్నారు అక్కడే నిలబడి జనగణమన గీతం ఆలపించి ఐక్యత చాటారు. పట్టణం, పల్లె తేడా లేకుండా ఆ కార్యక్రమం జరిగింది. గ్రామాల్లోని పంట పొలాల్లో ఉన్న మహిళా కూలీలు.. పొల్లాల్లోనే నిలబడి జాతీయ గీత ఆలపించారు. వరి నాట్లు వేస్తున్న మహిళలు.. అక్కడే నిలబడి ఓ చేత్తో వరితో మరోచేత్తే సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాలాపన చేశారు.

మంగళవారం ఉదయం 11-30కి తెలంగాణ మొత్తం భారత దేశ జాతీయ గీతం  జనగణమనతో హోరెత్తింది. నిమిషం పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు సంస్థల వద్ద సామూహికంగా జాతీయగీతాన్ని ఆలపించారు. మెట్రో రైళ్లను కూడా నిమిషం పాటు ఆపివేశారు. మెట్రో ప్రయాణికులు సామూహికంగా జాతీయ గీతాలాపన చేశారు.

హైదరాబాద్ జాతీయ గీతాలాపన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో రెడ్ సిగ్నల్ వేశారు. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడే నిలబడి జాతీయ గీతాపాలన చేశారు. అబిడ్స్‌ జీపీవో సర్కిల్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. వేలాది మంది జనాలతో కలిసి జనగణమన’ ఆలపించారు. కేసీఆర్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ గీతాపాలన కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పక్కా ప్రణాళికలతో గ్రాండ్ సక్సెస్ చేశారు.

Read Also: Gun Fire: హైదరాబాద్‌ శివారులో మళ్లీ కాల్పులు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News