Telangana: గ్రూప్ 4 విద్యార్ధులకు గుడ్‌న్యూస్, ఫిబ్రవరి 3 వరకూ గడువు తేదీ పొడిగింపు

Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 4 పోస్టుల దరఖాస్తు గడువును పెంచింది. అభ్యర్ధుల వినతుల నేపధ్యంలో గడువును మరో నాలుగు రోజులు పెంచింది ప్రభుత్వం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 31, 2023, 08:50 AM IST
Telangana: గ్రూప్ 4 విద్యార్ధులకు గుడ్‌న్యూస్, ఫిబ్రవరి 3 వరకూ గడువు తేదీ పొడిగింపు

ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇటీవల విడుదలైన గ్రూప్ 4 నోటిఫికేషన్ గడువు ముగియడంతో ప్రభుత్వం మరికాస్త పొడిగించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. దీనికి సంబంధించి దరఖాస్తు చేసేందుకు జనవరి 30 గడువు తేదీగా ఉంది. నిన్నటితో అది ముగిసింది. అయితే గ్రూప్ కేటగరీలో మరికొన్ని కొలువుల్ని జత చేస్తూ ప్రభుత్వం అనుబంధ ప్రకటన విడుదల చేయడం అభ్యర్ధుల వినతుల్ని దృష్టిలో ఉంచుకుని దరఖాస్తు గడువు తేదీని మరో నాలుగు రోజులు పొడిగించింది. అంటే ఫిబ్రవరి 3వ తేదీలోగా దరఖాస్తులకు సమయముంది. గ్రూప్ 4 ఉద్యోగాలకై ఇప్పటి వరకూ 8,47,277 అప్లికేషన్లు చేరాయి. ఇందులో జనవరి 29న 49 వేల అప్లికేషన్లు రాగా, జనవరి 30న 34, 247 అప్లికేషన్లు వచ్చాయి.

మరోవైపు రాష్ట్రంలో మరో ఆరు డాక్టర్ పోస్టుల భర్తీకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్య విద్యా సంచాలకుల పరిధిలో ఈఎన్టీ విభాగంలో 3 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 3 స్పీచ్ పాథాలజిస్టుల్ని నియమించనుంది. గ్రూప్ 4 అనుబంధ నోటిఫికేషన్‌లో భాగంగా మరో 141 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను చేర్చింది. అంటే మొత్తం 430 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కానున్నాయి. గ్రూప్ 4 సర్వీసుల్లో మొత్తం 8,180 ఖాళీల్ని టీపీఎస్‌సి భర్తీ చేయనుంది. 

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 63,320 ఉద్యోగాల్ని వివిధ దశల్లో భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ ఆర్ధిక శాఖ అనుమతిచ్చింది. ఇందులో బీసీ గురుకుల విద్యాలయాల్లో1499 పోస్టులున్నాయి. 

Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News