పరుపుల గోదాంలో అగ్నిప్రమాదం..రూ.8 లక్షల ఆస్తి నష్టం..

Fire Accident: ప‌రుపుల ప‌రిశ్ర‌మ‌లో మంట‌లు చెల‌రేగ‌డంతో భారీ అగ్ని ప్ర‌మాదం సంభవించింది. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ శివారు మైలార్ దేవ్ పల్లి వినాయక నగర్ బస్తీలో చోటు చేసుకుంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2021, 01:06 PM IST
  • హైదరాబాద్ నగర శివారులో అగ్నప్రమాదం
  • పరుపుల గోదాంలో ఎగసిపడిన మంటలు
  • రూ.8 లక్షల ఆస్తి నష్టం
పరుపుల గోదాంలో అగ్నిప్రమాదం..రూ.8 లక్షల ఆస్తి నష్టం..

Hyderabad Fire Accident: హైదరాబాద్ శివారు మైలార్​దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయకనగర్ బస్తీలో భారీ అగ్నిప్రమాదం(Massive fire accident) జరిగింది. దుర్గా కన్వెన్షన్​కు ఎదురుగా ఉన్న పరుపుల గోదాం(beds godown)లో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. పరుపులు తయారు చేయటానికి వినియోగించే మెటీరియల్ ఎక్కువగా ఉండటంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. భయంతో స్థానికులు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. 

దట్టమైన పొగ కమ్మేయడంతో బస్తీ వాసులు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు.  స్థానికులు అగ్నిమాపక శాఖ(Fire Department)కు సమాచారం అందించటంతో... రెండు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. ఈ ప్రమాదంలో రూ. 8 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని నిర్వాహకుడు తెలిపారు. విద్యుదా​ఘాతం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Huzurabad: భార్యను కత్తెరతో పొడిచిన భర్త

అయితే పరిశ్రమకు ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. బస్తీ మధ్యలో నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమ కొనసాగిస్తున్నట్లు బస్తీ వాసుల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేని పరిశ్రమల(industries)పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News