మెరిట్ ప్రాతిపదికనే ఏఈవో పోస్టులు: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (AEO) ఉద్యోగాలను మెరిట్ ప్రాతిపదికనే నియమిస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. పోస్టుల నియామకాలలో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేదన్నారు.

Last Updated : May 22, 2020, 12:34 PM IST
మెరిట్ ప్రాతిపదికనే ఏఈవో పోస్టులు: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (AEO) ఉద్యోగాలను మెరిట్ ప్రాతిపదికనే నియమిస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. పోస్టుల నియామకాలలో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేదన్నారు. ఏఈవో ఉద్యోగుల ఎంపిక ప్రక్రియను పూర్తిగా జిల్లాల కలెక్టర్లకు అప్పగించినట్లు వెల్లడించారు. Photos: రానా, మిహికా ఎంగేజ్‌మెంట్ ఫొటోలు

సమగ్ర వ్యవసాయ విధానం అమలు కోసం ఏఈఓ క్లస్టర్లలో క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఉండొద్దని, సీఎం కేసీఆర్ తాత్కాలిక ప్రాతిపదికన AEO ఉద్యోగ నియామకాలకు మొగ్గుచూపారని తెలిపారు. బయట జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, అభ్యర్థుల ఎంపికలో మార్కుల మెరిట్, రిజర్వేషన్, ఇతరత్రా అంశాల ఆధారంగా తీసుకుంటామన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, నియామకాలపై ఏ అపోహలు పెట్టుకోవద్దని అభ్యర్థులకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్

Trending News