కూలీలకు సైతం జాబ్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం అధికారులకు చెప్పిందని, ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలందరికీ పని కల్పి్ంచాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వలస కూలీల ద్వారా కరోనా వైరస్ గ్రామాల్లో వ్యాప్తి చెందుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఖతర్నాక్ ఫొటోలు వదిలిన కేథరిన్
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర్ శివారు టూక్యా తండాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి మంగళవారం పరిశీలించారు. ఉపాధి హామీ పనులు ఎలా జరుగుతన్నాయో అక్కడి కూలీలను ఆరాతీశారు. ఏయే పనులు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. వలస కూలీలకు మాస్కులు లేకపోవడంతో ఆశ్చర్యపోయిన మంత్రి ఎర్రబెల్లి.. తమ వద్ద ఉన్న మాస్కులను వారికి పంపిణీ చేశారు. బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి
మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, ఉపాధి పనులు చేయాలని కూలీలకు సూచించారు. దినసరి కూలీ కనీసం రూ.200 లభించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు మంత్రి సూచించారు. అందరికీ ఉపాధి కల్పించాలన్నదే, సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీల ద్వారా గ్రామాలకు సైతం కరోనా మహమ్మారి పాకుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. షూటింగ్ సెట్ ధ్వంసం చేసి వీడియోలు.. సీఎం ఆగ్రహం
బొజ్జన్నపేటలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన మంత్రి దయాకర్ రావు, వారికి కూలీ ఎంత పడుతుందని అడిగిన మంత్రి.
రోజుకు కూలీ కనీసం రూ.200 పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించిన మంత్రి. pic.twitter.com/BXwqw0thyQ
— Errabelli DayakarRao (@DayakarRao2019) May 26, 2020
కరోనా వైరస్ సోకుండా ఉండేందుకు వ్యక్తిగత పరిశుభ్రత అవసరమని, భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..