Asaduddin Owaisi: ప్రభాస్ నెక్ట్స్ మూవీ SALAARపై అసదుద్దీన్ ఒవైసీ ఫుల్ హ్యాపీ!

Asaduddin Owaisi Happy Over Movie Title SALAAR | ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖుషీ అవుతున్నారు. ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ కాంబోలో రానున్న సినిమాకు ‘సలార్’ అనే టైటిల్ ఖరారు చేశారు.

Last Updated : Dec 3, 2020, 08:42 PM IST
Asaduddin Owaisi: ప్రభాస్ నెక్ట్స్ మూవీ SALAARపై అసదుద్దీన్ ఒవైసీ ఫుల్ హ్యాపీ!

Asaduddin Owaisi Happy Over Movie Title SALAAR | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా (Prabhas Next with KGF Director Prashanth Neel)పై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖుషీ అవుతున్నారు. అందుకు కారణం ఆ సినిమా టైటిల్ అని తెలుస్తోంది. ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ కాంబోలో రానున్న సినిమాకు ‘సలార్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు డిసెంబర్ 2వ తేదీన సలార్ పోస్టర్‌తో పాటు ప్రభాస్ లుక్ సైతం విడుల చేశారు.

 

‘సలార్’ అనే టైటిల్‌ను ప్రభాస్ (Prabhas) లేటెస్ట్ మూవీకి ఖరారు చేయడంతో నెటిజన్లు ఈ పదంపై గూగుల్‌తో తెగ వెతకడం మొదలుపెట్టారు. సలార్ అనేది ఉర్దూ పదం. అందులోనూ ‘సలార్’ అంటే ధైర్యవంతుడని అర్థం వస్తుంది. ధైర్యవంతుడు, బలమైన నాయకుడు అనే అర్థం వచ్చేలా ఉర్దూ పదం సలార్‌ను ప్రభాస్ మూవీకి టైటిల్‌గా ఎంపిక చేయడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) హర్షం వ్యక్తం చేశారని సమాచారం.

Also Read : GHMC Exit Polls 2020: ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయంటే!

 

కాగా, ప్రభాస్ వరుస సినిమాలు ఒప్పుకోవడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. ఈ తరుణంలో సలార్ మూవీని ఎందుకు టచ్ చేశాడా అని ఆలోచిస్తున్నారు. పెళ్లి విషయంపై ఫోకస్ చేయాల్సిన ప్రభాస్ వరుస సినిమాలపై శ్రద్ధ వహించడంతో టాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆలోచనలో పడ్డారు.

Photos : Madhumita Sarkar Photos: బుల్లితెరను ఏలుతున్న మధుమితా సర్కార్..

Also Read : WhatsApp Amazing Features: ఈ వాట్సాప్ ఫీచర్స్‌ను మీరు ట్రై చేశారా! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

More Stories

Trending News