Dubbaka Bypoll Reaction: ఓటమికి బాధ్యత నాదే: మంత్రి హరీష్ రావు

దుబ్బాక ఉపఎన్నిక ఓటమిపై టీఆర్ఎస్ నేత , మంత్రి హరీష్ రావు స్పందించారు. ఓటమికి తనదే బాధ్యతని అంగీకరించారు. పరిస్థితిని సమీక్షించి..లోపాల్ని సరిదిద్దుకుంటామన్నారు.

Last Updated : Nov 10, 2020, 06:38 PM IST
Dubbaka Bypoll Reaction: ఓటమికి బాధ్యత నాదే: మంత్రి హరీష్ రావు

దుబ్బాక ఉపఎన్నిక ఓటమి ( Dubbaka Bypoll Defeat )పై టీఆర్ఎస్ నేత , మంత్రి హరీష్ రావు ( Minister Harish rao ) స్పందించారు. ఓటమికి తనదే బాధ్యతని అంగీకరించారు. పరిస్థితిని సమీక్షించి..లోపాల్ని సరిదిద్దుకుంటామన్నారు.

తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలోని దుబ్బాక నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో అధికారపార్టీ టీఆర్ఎస్ ( Dubbaka ) కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు ( Bjp Candidate Raghunandan rao ) చేతిలో టీఆర్ఎస్ అభ్యర్ధిని సుజాత ఓటమి పాలవడం పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నారు. 1470 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి విజయం సాధించి చరిత్ర సృష్టించింది.

ఇప్పటికే ఈ ఉప ఎన్నిక ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ ( Minister KTR ) స్పందించారు. ప్రజాతీర్పును స్వాగతిస్తామని..ఓటమిని విశ్లేషించుకుంటామని చెప్పారు. ఎన్నికల్లో గెలుపోటములు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నారు. ఇప్పుడు ఉప ఎన్నిక బాధ్యతను తీసుకున్న మంత్రి హరీష్ రావు స్పందించారు.

దుబ్బాకలో ప్రజా తీర్పును శిరసా వహిస్తామని చెప్పారు. ఉప ఎన్నిక ఓటమికి తానే బాధ్యత వహిస్తానని స్పష్టం చేశారు. ఓటమికి కారణాల్ని పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామని..లోపాల్ని సరిదిద్దుకుంటామని మంత్రి హరీష్ రావు ( Minister Harish rao ) తెలిపారు. ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని...తాను కూడా జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటానని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.  

టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్‌ 3న జరిగిన ఈ ఎన్నికలో ఊహించని విధంగా బీజేపీ విజయం సాధించింది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నువ్వా నేనా రీతిలో ఉత్కంఠ భరితంగా సాగింది. చివరికి విజయం బీజేపీను వరించింది. Also read; Dubbaka Bypolls: అపజయాలకు కుంగిపోము, ఓటమిని విశ్లేషిస్తాం-కేటీఆర్

Trending News