ఢిల్లీలో ఒక న్యాయం.. రాష్ట్రంలో మరో న్యాయమా.. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హరీష్ రావు రియాక్షన్...

Minister Harish Rao reaction over BJP MLA's Suspension: అసెంబ్లీ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్‌లను సస్పెండ్ చేయడంపై మంత్రి హరీష్ రావు స్పందించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2022, 05:46 PM IST
ఢిల్లీలో ఒక న్యాయం.. రాష్ట్రంలో మరో న్యాయమా.. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హరీష్ రావు రియాక్షన్...

Minister Harish Rao reaction over BJP MLA's Suspension: బడ్జెట్ సమావేశాల తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై మంత్రి హరీష్ రావు స్పందించారు. స్పీకర్ వెల్‌లోకి దూసుకొచ్చినందునే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వెల్‌లోకి వస్తే సస్పెన్షన్ ఉంటుందని గత బీఏసీలోనే నిర్ణయించామన్నారు. కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి రాలేదు కనుక వారిని సస్పెండ్ చేయలేదన్నారు. అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ సందర్భంగా హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

గత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభలో 12 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. తమ స్థానంలో నిలబడి ప్రశ్నించినందుకే వారిని సస్పెండ్ చేశారన్నారు. ఢిల్లీలో ఒక న్యాయం.. రాష్ట్రంలో మరో న్యాయమా అని ప్రశ్నించారు. సస్పెన్షన్ వేటు వేయించుకోవాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి వచ్చారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ స్పీచ్ సమయంలో వెల్‌లోకి వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామన్నారు.

రాష్ట్ర బడ్జెట్‌లో ఈసారి 30కి పైనే కొత్త స్కీమ్స్ పెట్టామన్నారు హరీష్ రావు. ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.3 లక్షల స్కీమ్‌కి, డబుల్ బెడ్ రూమ్ స్కీమ్‌కి సంబంధం లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలో 1500 మంది దళితులకు దళిత బంధు పథకం అందిస్తామన్నారు. ఈ ఏడాది 45 వేల మంది దళిత బంధు పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వచ్చే బడ్జెట్ పూర్తయ్యే నాటికి రాష్ట్రంలో 2 లక్షల మందికి  దళిత బంధు పథకం అందుతుందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఫైట్ చేస్తామన్నారు. నిధులు వస్తాయనే ఆశాభావంతోనే బడ్జెట్‌లో వాటిని చూపించామన్నారు. 

Trending News