Minister KTR: తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి.. గొప్పగా సంబరాలు చేసుకోవాలి: మంత్రి కేటీఆర్

Palamuru-Rangareddy Project Inauguration Ceremony: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోనుందన్నారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని అన్నారు. లక్షన్న మంది రైతులను ప్రారంభోత్సవ సభ నిర్వహిస్తామని తెలిపారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 9, 2023, 03:57 PM IST
Minister KTR: తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి.. గొప్పగా సంబరాలు చేసుకోవాలి: మంత్రి కేటీఆర్

Palamuru-Rangareddy Project Inauguration Ceremony: ఈ నెల 16వ తేదీన జరిగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర సచివాలయంలో మంత్రి కేటీఆర్ సమీక్షించారు.  మహబుబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, వివిధ శాఖల అధికారులు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో వలసల జిల్లా పాలమూరు జిల్లా పచ్చగా మారనుందన్నారు. ప్రతి ఏటా లక్షలమంది పాలమూరు ప్రజలు వలస పోయే పరిస్థితి ఉండేదని.. కానీ నేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామన్నారు.

"పాలమూరుతో పాటు రంగారెడ్డి జిల్లా భూములకు సైతం నీళ్లు అందిస్తుంది. గోదావరిలో కాళేశ్వరం, కృష్ణాలో పాలమూరు-రంగారెడ్డి లాంటి గొప్ప ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కట్టింది. సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయితే తెలంగాణ సాగునీటి రంగంలో ప్రాజెక్టులు సంతృప్త స్థాయిలో పూర్తి అవుతాయి. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టిన ప్రాజెక్టులను చూసి కేవలం తెలంగాణ బిడ్డగానే కాకుండా భారత దేశ పౌరుడిగా కూడా గర్వంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం వెనక 2001 నుంచి కన్న తెలంగాణ ప్రజల కల ఇది. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ గారి ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న గొప్ప ప్రాజెక్టు ఇది. 

పాలమూరు రంగారెడ్డి ప్రజలు పడిన కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు ఇది. అనేక అడ్డంకులను దాటుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదలతో పూర్తయిన ప్రాజెక్టు ఇది. రైతుల పొలాలకు సాగునీటితో పాటు, రాజధాని ప్రజల తాగునీటి అవసరాలు, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాను కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుంది. 16వ తేదీన జరిగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

ఇంత గొప్ప సందర్భాన్ని గొప్పగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాజెక్టు విశిష్టతను ప్రజలకు తెలియజేసేలా గొప్పగా సంబరాలు చేసుకోవాలి. కనీసం లక్షన్నర మంది రైతులతో ప్రారంభోత్సవం సభ ఉంటుంది." అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర విభాగాల అధికారులతో మంత్రులు చర్చించారు. మంత్రులు సంబంధిత ఎమ్మెల్యేలతో సభకు అవసరమైన ఏర్పాట్లను స్థానికంగా సమన్వయం చేసుకుంటారని చెప్పారు.

Also Read: IND vs PAK Dream11 Prediction Today Match: పాక్‌తో టీమిండియా బిగ్‌ఫైట్‌.. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇలా..  

Also Read: Chandrababu Arrest Latest Updates: చంద్రబాబే ప్రధాన కుట్రదారు.. పదేళ్ల జైలు శిక్షకు అవకాశం: ఏపీ సీఐడీ చీఫ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News