బాన్సువాడ పర్యటనలో మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సొంత నియోజకవర్గమైన బాన్సువాడలో రాష్ట్ర మున్సిపాలిటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు శనివారం పర్యటించారు.

Last Updated : Nov 30, 2019, 05:45 PM IST
బాన్సువాడ పర్యటనలో మంత్రి కేటీఆర్

బాన్సువాడ: తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సొంత నియోజకవర్గమైన బాన్సువాడలో రాష్ట్ర మున్సిపాలిటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు శనివారం పర్యటించారు. నేడు అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్పీకర్‌గా పోచారం శ్రీనివాస్ రెడ్డి అద్భుతమని కొనియాడారు. శాసన సభలో జరిగిన కొన్ని సన్నివేశాలను మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకుంటూ.. ఆయనలోని నిబద్దత, పట్టుదల తమలాంటి వారికి ఆదర్శమని అన్నారు. 

ఈ కార్యక్రమంలో క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ బాన్సువాడ నుండి జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలకు ముందు వరుసల్లో ఉండాలని క్రీడాకారులను ఉత్తేజపర్చారు.

Trending News