TSRTC: ఆధునిక హంగులతో కొత్త సూపర్ లగ్జరీ బస్సులు

TSRTC Super Luxury Busses: కొత్త సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలను టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, టిఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌తో కలిసి  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 02:00 AM IST
TSRTC: ఆధునిక హంగులతో కొత్త సూపర్ లగ్జరీ బస్సులు

TSRTC Super Luxury Busses: ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక హంగులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులను హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై శనివారం ఘనంగా ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ జెండా ఊపి ఈ కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులను ప్రారంభించారు. అంతకంటే ముందుగా కొత్తగా ఆర్టీసీలోకి ప్రవేశపెడుతున్న సూపర్ లగ్జరీ బస్సులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్‌పై సందడి వాతావరణం నెలకొంది.

 

కొత్త సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలను టీఎస్‌ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, టిఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌తో కలిసి  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు.  కొత్త సూపర్ లగ్జరీ బస్సులు ట్యాంక్ బండ్ పరిసరాలను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకుల దృష్టిని ఆకర్షించాయి.

ఈ ప్రారంభోత్సవంలో ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, రవాణా, రహదారి, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, రవాణా శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్దా ప్రకాశ్‌తో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Trending News