ములుగు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో అధికారులు తనను అవమానించారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న స్థానిక ప్రజాప్రతినిధిని అయిన తనను అధికారులు వేదికపైకి ఆహ్వానించకుండా కించపర్చారని సీతక్క ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఆదివాసిననే ఉద్దేశంతోనే అధికారులు తనను అవమానించారని చెబుతూ అధికార పార్టీకి అధికారులు భయపడుతున్నందువల్లే వాళ్లు ఎలా చెబతే అలా నడుచుకుంటున్నారని అన్నారు.
ఈ సందర్భంగా అధికారుల తీరును ఎండగట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. తనను అవమానిస్తే అది కేవలం తనను మాత్రమే అవమానించినట్టు కాదని.. మొత్తం ములుగు ప్రజలనే అవమానించినట్లవుతుందని అన్నారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం