MLC Jeevan reddy: పోచారంలో ఏంచూసి సలహాదారు పోస్టిచ్చారు..?.. ఏఐసీసీ చీఫ్‌కు సంచలన లేఖ రాసిన జీవన్ రెడ్డి..

mlc Jeevan reddy letter to aicc:  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏఐసీసీ చీఫ్ మల్లి కార్జున ఖర్గేకు సంచలన లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 24, 2024, 02:54 PM IST
  • కాంగ్రెస్ పై మరోసారి పైర్ అయిన జీవన్ రెడ్డి..
  • ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు లేఖ
MLC Jeevan reddy: పోచారంలో ఏంచూసి సలహాదారు పోస్టిచ్చారు..?.. ఏఐసీసీ చీఫ్‌కు సంచలన లేఖ రాసిన జీవన్ రెడ్డి..

mlc Jeevan reddy hot comments on congress: తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కొమ్ములాటలు బైట పడినట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా.. కొన్నినెలల  క్రితమే జగిత్యాలకు చెందిన బీఆర్ఎస్ నేత డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దీనిపై బహిరంగంగానే వ్యతి రేకించారు. కొన్నిరోజుల పాటు అలకను సైతం బూనారు. అంతే కాకుండా  తనకు కాంగ్రెస్ లో తగిన విధంగా గౌరవందొరకడంలేదని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ దిగొచ్చి.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించారు. ఇదిలా ఉండగా తాజాగా, మళ్లీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి ఇటీవల హత్యకు గురయ్యారు.

కాంగ్రెస్ లో చేరిన డాక్టర్ సంజయ్ అనుచరుడు సంతోష్, జీవన్ రెడ్డి అనుచరుడైన గంగారెడ్డిని హత్యచేసినట్లు తెలుస్తొంది. ఒక ప్రధాన పార్టీ అనుచరుడిని చంపడం పట్ల జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్న వాళ్ల పరిస్థితి ఇలా ఉంటే.. ఇతరులకు ఎలా అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఇన్నేళ్లు ఉన్న తనకు అన్యాయం జరిగిందన్నారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తోందని పోలీసులపై ఫైర్ అయ్యారు. అంతే కాకుండా.. ఇక మీదట కాంగ్రెస్ లో ఉండలేనని కూడా ఎమోషనల్ అయ్యారు.

ఇటీవల కాంగ్రెస్ లో సంఖ్యాబలం  ఉన్న కూడా.. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లను చేర్చుకొవడం మీద కూడా హాట్ కామెంట్స్ చేశారు. బాన్సువాడకు చెందని నేత పోచారంకు పార్టీల ఫిరాయింపులు ఏవిధంగా చేయాలో మాత్రమే తెలుసని, ఆయనను ఏం చూసి సలహాదారు పదివి ఇచ్చారో తెలియట్లేదని అన్నారు. కాంగ్రెస్ ముసుగులోనే గంగా రెడ్డిని హత్య చేశారన్నారు. గతంలో సంతోష్ రెడ్డిపై అనేక కేసులున్నాయన్నారు. 

Read more: MLC Jeevan Reddy: పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్.. కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. భారీగా చేరుకున్న బలగాలు..

కార్ తో ఢీ కొట్టి 20 కత్తిపోట్లు దింపి కిరాతకంగా గంగారెడ్డిని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గంగా రెడ్డి ని మార్కెట్ కమిటీ చైర్మన్ గా నేను సిఫారస్ చేసిన కొద్దిరోజుల్లోనే హత్య జరగటం వెనుక కుట్ర ఉందన్నారు. స్థానిక నేతల అండతోనే.. తమ్ముడి లాంటి తన అనుచరుడిని హత్య చేశారని కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదనతో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ చీఫ్ మల్లి కార్జున ఖర్గేకు లేఖను రాశారు. తనను సంపుకుంటారో.. సాదుకుంటారో మీరే చెప్పాలని కూడా.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమోషనల్ అయినట్లు తెలుస్తొంది.   కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పింది ఏంటీ.. ఇక్కడ చేస్తుందేమిటీ అని గాంధీ భవన్ వేదికగా ఫైర్ అయ్యారు .   పార్టీ ఫిరాయింపులపై మాత్రం జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా రచ్చగా  మారాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News