Mobile Phone Explodes in Telangana While Driving: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ రైతు డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడే క్రమంలో ఫోన్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. సంధ్య తండా కు చెందిన గగులోతు రవి అనే డ్రైవర్ ట్రాక్టర్ మరమ్మత్తుల నిమిత్తం వరంగల్ నగరానికి బయలుదేరాడు. నగర సమీపంలోకి చేరుకోగానే తమ బంధువులు ఆయనకు ఫోన్ చేశారు.
రవి తన బంధువులతో ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా ఫోన్ నుంచి మంటలు వచ్చి పేలిపోయింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న అతను ఒక్కసారిగా భయాందోళనకు గురై ట్రాక్టర్ స్టీరింగ్ ని విడిచిపెట్టాడు. దీంతో ఆ ట్రాక్టర్ నియంత్రణ కోల్పోయి ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు. అక్కడే ఉన్న స్థానికులు రవిని ఆస్పత్రికి తరలించారు.
Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్
వరంగల్ జిల్లాలోని ఎనుమాము మార్కెట్లో స్మార్ట్ ఫోన్ పేలిన సంఘటన మరువక ముందే ఈ ఘటన జరగడం అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. మహబూబ్నగర్ జిల్లా పెద్ద గూడూరు కు చెందిన ఓ రైతు తను పండించిన మిర్చి పంటను విక్రయించేందుకు ఎనుమాముల మిర్చి మార్కెట్ కి వచ్చాడు. ఇంతలో ఆయనకు ఫోన్ కాల్ రాగానే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే క్రమంలో ఒక్కసారిగా స్మార్ట్ ఫోన్ పేలింది. ఈ ఘటనలో ఆ రైతు చేయికి తీవ్ర గాయాలయ్యాయి.
ఫోన్లు పేలడానికి కారణాలు ఇవేనా?:
✺ కొన్ని స్మార్ట్ ఫోన్లు బ్యాటరీ లోపం కారణంగా కూడా పేలిపోతాయి.
✺ తయారీ లోపం కారణంగా కూడా స్మార్ట్ ఫోన్లు పేలే అవకాశాలున్నాయి.
✺ చార్జ్ చేసే క్రమంలో బ్యాటరీ వేడెక్కడం వల్ల కూడా మొబైల్ ఫోన్స్ పేలుతాయి.
✺ కంపెనీ చార్జర్ కాకుండా ఇతర చార్జర్లను వినియోగించడం వల్ల కూడా బ్యాటరీలు పేలే అవకాశాలు ఉన్నాయి.
✺ చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడడం, యూట్యూబ్ వీడియోలు చూడడం వల్ల కూడా ఈ ప్రమాదం సంభవించవచ్చు.
✺ ఫోన్ మాట్లాడే క్రమంలో ఇంటర్నెట్ ఆన్ చేసి మాట్లాడడం వల్ల ఫ్యాక్టరీలు పేలవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read: నేటి నుండి మూడు రోజులపాటు ఈరాశుల ఇళ్లపై డబ్బు వర్షం... మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook