Narendra Modi: మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి.. గ్యారంటీకి తోడు నిలవండి: నరేంద్ర మోదీ

ప్రస్తుత ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని.. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని మరోసారి ఆరోపించారు. తెలంగాణ వికాసం కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డీకే అరుణను మహబూబ్‌నగర్‌ ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 10, 2024, 06:45 PM IST
Narendra Modi: మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి.. గ్యారంటీకి తోడు నిలవండి: నరేంద్ర మోదీ

Narendra Modi: ప్రస్తుత ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని.. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని మరోసారి ఆరోపించారు. తెలంగాణ వికాసం కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డీకే అరుణను మహబూబ్‌నగర్‌ ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: KTR: ఎన్నికల్లో 12 ఎంపీలు ఇవ్వండి.. కేసీఆర్‌ను సీఎం చేద్దాం: కేటీఆర్‌ పిలుపు

నారాయణపేట సభలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్ ను నిర్దేశించే ఎన్నికలు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు తప్పుడు వాగ్ధానాలు చేస్తూ వచ్చాయి. మోడీ గ్యారెంటీని ఇప్పుడు అందరూ చూస్తున్నారు.. మోడీ గ్యారెంటీ అంటే అభివృద్ధి జరిగే గ్యారెంటీ. మోడీ అభివృద్ధి అంటే ప్రపంచంలోనే భారత్‌ను అత్యున్నత స్థానంలో నిలిపే గ్యారెంటీ. మోడీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా అమలయ్యే గ్యారెంటీ' అని మోదీ తెలిపారు.

Also Read: Narendra Modi: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల సిద్ధాంతం బై ద ఫ్యామిలీ, ఫర్ ద ఫ్యామిలీ.. ఆఫ్ ద ఫ్యామిలీ

 

'పదేండ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది.. పదేండ్లలో తెలంగాణ అభివృద్ధికి లక్షల కోట్లు పంపించాం. కానీ ఈ డబ్బులు ఎటు పోయాయి' అని ప్రశ్నించారు. తెలంగాణను ఏటీఎంగా మార్చుకుని పదేండ్లుగా బీఆర్ఎస్ లూటీ చేసింది.. ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నో రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది.. కానీ బీఆర్ఎస్‌ పార్టీకి ఫొటో కాపీగా మారిందని చెప్పారు.

'బీఆర్ఎస్ ఇన్నేండ్లలో చేసిన అవినీతిని కాంగ్రెస్ కొన్ని నెలల్లోనే చేసింది. పరిశ్రమల పేరిట కాంగ్రెస్ ఫేక్ వీడియోల మాన్యుఫ్యాక్చరింగ్ దుకాణాన్ని తెరిచింది. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తోంది.. దీనిపై ఢిల్లీ వరకు చర్చ జరుగుతోంది' అని మోదీ ఆరోపించారు. నేను కొద్ది రోజులుగా ఆర్ఆర్ ట్యాక్స్ గురించి నేను ప్రస్తావిస్తున్నా కానీ ఎన్నడూ వారి పేర్లను చెప్పలేదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మీడియా ముందు వెళ్లి డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడి ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో చెప్పకనే చెప్పారు' అని మోదీ వివరించారు.

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మోదీ విమర్శలు చేశారు. 'రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ మోసం చేసింది. రైతులకు కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసింది. రాహుల్‌కు ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. విషాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. దక్షిణాది ప్రజలను ఆఫ్రికన్లుగా పోల్చి అవమానించారు. ఆ ఫిలాసఫర్‌కు తెలంగాణ ప్రజల చర్మం రంగు నచ్చకపోవడంతో ఇలా అవమానిస్తున్నాడు' అని ప్రధాని మోదీ విమర్శించారు.

'దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్ హిందువులన్నా, హిందువల పండుగలన్నా ద్వేషం. అయోధ్య రామమందిరాన్ని నిర్మించవద్దని ఆ ఫిలాసఫర్ దేశానికి వ్యతిరేకమని అన్నాడు. అయోధ్య రాముడిని దర్శించుకోవడాన్ని దేశ ద్రోహంగా పరిగణించి సర్టిఫికెట్ ఇవ్వాలని చూస్తున్నారు. కాంగ్రెస్ నేతలు భారత విరోధులు. కాంగ్రెస్ దేశాన్ని ధర్మం, కులాల పేరిట విడగొట్టాలని ప్రయత్నిస్తోంది' అని మోదీ ఆరోపణలు చేశారు.

'మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా ఇచ్చారు. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ అసలు ఎజెండా. కాంగ్రెస్‌కు దేశంపై ప్రేమ లేదు.. హిందువులపై కూడా ప్రేమ లేదు. కాంగ్రెస్ ముందు నుంచే హిందు విరోధి పార్టీ. ఉమ్మడి ఏపీలో ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్లు కల్పించినట్లే దేశవ్యాప్తం చేయాలని చూస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను హరించే పార్టీకి మద్దతునిస్తారా?' అని మోదీ ప్రశ్నించారు.

'వంచితుల అధికారం, హక్కులను కాపాడేందుకు నేను చౌకీదార్‌గా ఉంటాను. అప్పుడు హక్కులను ఎవరూ హరించలేరు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సంతోషంగా పనిచేస్తోంది. కానీ మాదిగలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో వారి గొంతుకను వినేందుకు కూడా సిద్ధంగా లేదు. మాదిగలు కాంగ్రెస్ ఓటు బ్యాంకు కాదు కాబట్టే వారి హక్కులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ దేశ ప్రగతిని వ్యతిరేకించే పార్టీ. దీన్ని అడ్డుకునేందుకు కొండలా నేను నిలబడ్డా. ఇందులో నా శక్తి ఏంటంటే.. మీరు నాపై చూపించే ప్రేమ, ఓటు నుంచి లభిస్తుంది' అని పేర్కొన్నారు. డీకే అరుణకు మీరు వేసే ప్రతి ఓటు నేరుగా మోడీకి వేసిట్లే. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థి ఫిక్సింగ్‌లో ఉన్నారని తెలుసు. ఈ సీటును గెలుచుకునేందుకు వాళ్లు ఎలాంటి ఆటలు ఆడుతున్నారో కూడా నాకు తెలుసు. అరుణ ఒక మహిళ.. ఆమెను స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఘోరంగా అవమానించేలా విమర్శలు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News