బీజేపిలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు

బీజేపిలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు

Updated: Nov 4, 2019, 07:35 PM IST
బీజేపిలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు

న్యూఢిల్లీ: తెలంగాణలో టీడీపికి ముఖ్యనేతల్లో ఒకరిగా, రాజకీయంగా ప్రత్యర్థులకు పార్టీ తరపున ఓ ఫైర్‌బ్రాండ్‌గా ఎదిగి, రాష్ట్ర విభజన తర్వాత టీడీపీపై విసుగుచెంది పార్టీ నుంచి బయటికొచ్చిన మోత్కుపల్లి నరసింహులు ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. అంతకన్నా ముందుగా తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్, ఇటీవలే బీజేపిలో చేరిన వివేక్ వెంకట స్వామి, ఎంపీ గరికపాటి మోహన్ రావు, వీరేందర్ గౌడ్‌ల సమక్షంలో ఆయన కేంద్ర మంత్రి అమిత్‌ షాను కలిశారు. 

బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డిల ఆహ్వానం మేరకే మోత్కుపల్లి నర్సింహులు బీజేపిలో చేరినట్టు సమాచారం.