Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి సంగతి తేలుస్తాం.. బండి సంజయ్ వార్నింగ్

TS Election 2023: బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కరి సంగతి తేలుస్తామని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. కరీనగర్‌లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులకు బుద్ధి చెప్పి.. బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఎన్నికల్లో గెలిచి కరీంనగర్ ప్రజలకు సేవ చేసుకుంటానని అన్నారు.  

Last Updated : Nov 14, 2023, 01:14 PM IST
Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి సంగతి తేలుస్తాం.. బండి సంజయ్ వార్నింగ్

TS Election 2023: ‘‘ఈ ఇసుక కుప్పలు కన్పిస్తే పైసలు గుంజుతున్నరు. ఖాళీ జాగా కన్పిస్తే కబ్జా చేస్తున్నరు. ప్రజల రక్తం తాగుతున్నరు. బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి సంగతి తేలుస్తాం.’’ అని ఎంపీ, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతల రౌడీయిజం, అవినీతి తారాస్థాయికి చేరిందని మండిపడ్డారు. శవాలపై చిల్లర ఏరుకుంటున్న దుర్మార్గులు బీఆర్ఎస్ నేతలని ధ్వజమెత్తారు. శ్మశాన వాటికల్లో గడ్డి పెరిగిందని దొంగ బిల్లులు పెట్టి లక్షల రూపాయలు దండుకున్న నీచులని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు భూకబ్జాలు, అవినీతికి పాల్పడటం తప్ప చేసిందేమీ లేదన్నారు. పొరపాటున ఆ రెండు పార్టీల్లో ఎవరు గెలిచినా ప్రజల రక్తం తాగుతారని అన్నారు. ఓడిపోతాననే భయంతో ఒవైసీ వద్దకు పోయి మోకరిల్లి పచ్చ జెండా పట్టుకున్నారని ఎద్దేవా చేశారు. పొరపాటున బీఆర్ఎస్ అభ్యర్ధి గెలిస్తే బొట్టుపెట్టుకుని కంకణం కట్టుకుని తిరిగే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఓటు బ్యాంకుగా మారి పువ్వు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బుద్ది చెప్పాలని కోరారు. ఎన్నికల్లో భాగంగా బండి సంజయ్ ఈరోజు భగత్ నగర్, రామచంద్రాపూర్, అంజనాద్రి కాలనీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  

"కరీంనగర్‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులిద్దరిదీ భూకబ్జాల, అక్రమ దందా, అవినీతి లొల్లి.. ఇసుక కుప్పలు కన్పిస్తే డబ్బులు వసూలు చేస్తున్నరు. ఖాళీ జాగా కన్పిస్తే కబ్జా చేస్తున్నరు. నేను ఎవరి భూములను కబ్జా చేయలే. అవినీతికి పాల్పడలే.. ప్రజల కోసం పోరాడే మనిషిని. నన్ను గెలిపిస్తే వాళ్ల సంగతి తేలుస్తా.. కరీంనగర్ ప్రజలకు సేవ చేసుకుంటా. అవినీతి, అక్రమార్కుల సంగతి తేలుస్తా. మందికి పుట్టిన పిల్లలను నా పిల్లలకు భావించే రకం బీఆర్ఎస్ నాయకులు. కరీంనగర్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నేను నిధులు తీసుకొస్తే.. కనీసం నన్ను పిలవకుండా కొబ్బరికాయకొట్టి తానే నిధులు తెచ్చినట్లుగా ఫోజులు కొడుతున్నడు. ప్రజలంతా అమాయకులు ఏదైనా నమ్ముతారనుకుంటున్నడు. మీ దమ్ము చూపండి. పువ్వు గుర్తుపై ఓటేసి గుద్దితే బీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలె. 

గంగుల కమలాకర్‌కు మూడుసార్లు ఓట్తేస్తే ఎన్నడైనా ఇక్కడి ప్రజల గురించి ఆలోచించారా..? దోచుకోవడం దాచుకోవడం తప్ప ఆయన చేసిందేమీ లేదు. నన్ను ఎంపీగా గెలిపిస్తే మీకోసం యుద్దం చేసిన. మీకు డబుల్ ఇండ్లు ఇస్తే నేనెందుకు కొట్లాడతా. మీ పిల్లలకు ఉద్యోగాలిచ్చారా? ఒక్కరికైనా ఇవ్వలేదే... వాళ్ల కోసం నేను కొట్లాడితే నన్ను అర్ధరాత్రి గుంజుకపోయి జైల్లో వేసిర్రు. రైతుల కోసం కొట్లాడిన. ఉద్యోగుల కోసం పోరాడిన. నేను నాలుగున్నరేళ్లుగటా మీకోసం కొట్లాడుతూనే ఉన్నా. నేను నా కోసం కొట్లాడలే. నా కుటుంబం కోసం జైలుకుపోలే... మీకోసం కొట్లాడి జైలుకుపోయిన. ఆలోచించండి.

ఇక్కడున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులిద్దరూ భూకబ్జాదారులే. ప్రజల గురించి ఆలోచించిన దాఖలాల్లేవు. భూముల గురించి ఒకరు కొకరు కొట్లాడటం తప్ప వాళ్లు చేసిందేముంది..? ఎన్నికలొస్తుంటే బీజేపీపై తప్పుడు ప్రచారం చేయడం అలవాటైంది. గంగుల కమలాకర్ పౌరసరఫరాల శాఖ మంత్రి. కానీ ఒక్క కొత్త రేషన్ కార్డు అయినా ఇచ్చారా? ఒక్కరికైనా ఇల్లు ఇచ్చారా? సమాధానం చెప్పాలి. పొరపాటున గంగులను గెలిపిస్తే ఇండ్లు రావు. రేషన్ కార్డులు రావు. ఉద్యోగాలు రావు. పొరపాటున కేసీఆర్ అదికారంలోకి వస్తే ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడుతుంది.

గంగుల కమలాకర్ గెలిచే పరిస్థితి లేదు. ఓడిపోతాడని తెలిసి కేసీఆర్ ఆయనకు బి.ఫాం ఇవ్వకుండా చాలా రోజులు జాప్యం చేసిండు. అయినప్పటికీ ప్రజలను మోసం చేసి డబ్బులు పంచి గెలవాలని చూస్తున్నడు. మీరంతా ఆలోచించండి.... బండి సంజయ్ ను గెలిపించకపోతే యువకుల పక్షాన పోరాడే వారు ఉండరు. బండి సంజయ్ కొట్లాడితేనే డబుల్ బెడ్రూం ఇండ్లు రావని, పెన్షన్లు రావని, వడ్లు కొనబోరని పేదలు, వృద్దులు, రైతులు చెబుతున్నరు. 

నేను ప్రశ్నించే గొంతుకను. నన్ను పిసికిచంపాలని చూస్తున్నరు. పొరపాటున గంగులను గెలిపించినా, కేసీఆర్ మళ్లీ  అధికారంలోకి వచ్చినా మీకు నరకం చూపిస్తడు. కేంద్ర నిధులన్నీ దోచుకుపోతడు. కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపిస్తే ఊళ్లల్లో భూములను కబ్జా చేసుకుంటడు. బీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపిస్తే నగరంలోని భూములను, గుట్టలను మాయం చేస్తడు... పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులను ఒక్కసారి బేరీజు వేసుకోండి. మీకోసం కొట్లాడేదెవరు? మీకోసం జైలుకుపోయిందెవరు? మిమ్ముల్ని దోచుకునేదెవరో ఆలోచించండి.
 
గంగుల కమలాకర్ ఇప్పటికే పిల్లలకు, యువకులకు గంజాయి అలవాటు చేసి మత్తులో ముంచుతున్నడు. కుటుంబాల్లో చిచ్చు పెట్టిండు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో లక్ష సెల్ ఫోన్లు తీసుకొచ్చి పంచేందుకు సిద్ధమైండు. ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు రెడీ అయ్యిండు. నన్ను ఓడించేందుకు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. గంగుల గుర్తుంచుకో.. నువ్విచ్చే పైసలు తీసుకుంటరు. సెల్ ఫోన్లు తీసుకుంటరు. నువ్వు చేసే అరాచకాలను ఆ సెల్ ఫోన్లలో తీసి బయటకు పంపుతరు. నిన్న ఓడించడం ఖాయం.." అని బండి సంజయ్ జోస్యం చెప్పారు.

Also Read: 7th Pay Commission: దీపావళికి రాష్ట్ర ప్రభుత్వాలు గిఫ్ట్.. ఏ రాష్ట్రం ఎంత జీతం పెంచిందంటే..?

Also Read: Diabetes Control Tips: మధుమేహం వ్యాధిగ్రస్థులు రోజూ మెంతి నీళ్లు ఎందుకు తాగాలి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News