Munnur Ravi in TRS Plenary: టీఆర్ఎస్ ప్లీనరీలో కలకలం.. అనూహ్యంగా ప్రత్యక్షమైన మున్నూరు రవి

Munnur Ravi in TRS Plenary :  మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మున్నూరు రవి టీఆర్ఎస్ ప్లీనరీకి రావడం హాట్ టాపిక్‌గా మారింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 11:06 AM IST
  • టీఆర్ఎస్ ప్లీనరీలో మున్నూరు రవి
  • అనూహ్యంగా ప్రత్యక్షమైన రవి
  • మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో రవి నిందితుడు
Munnur Ravi in TRS Plenary: టీఆర్ఎస్ ప్లీనరీలో కలకలం.. అనూహ్యంగా ప్రత్యక్షమైన మున్నూరు రవి

Munnur Ravi in TRS Plenary : హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల్లో అనూహ్య కలకలం రేగింది. పార్టీ ప్లీనరీకి మహబూబ్‌నగర్‌కి చెందిన మున్నూరు రవి హాజరయ్యాడు. ప్లీనరీకి హాజరవడమే కాదు కొందరు నేతలతో కలిసి ఆయన ఫోటోలు కూడా దిగారు. సీఎం కేసీఆర్ ప్రసంగించిన సమయంలో ఆయన ప్లీనరీలోనే ఉన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో నిందితుడిగా ఉన్న మున్నూరు రవి ఇలా ప్లీనరీలో ప్రత్యక్షమవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

టీఆర్ఎస్ ప్లీనరీకి కీలక నేతలను మాత్రమే ఆహ్వానించారు. కేవలం 3వేల మందికి మాత్రమే పాసులు ఇచ్చారు. అయితే మున్నూరు రవి ఇతరుల పాస్‌పై అక్కడికి వచ్చాడా... లేక అతనికి కూడా పాస్ అందిందా అన్న చర్చ జరుగుతోంది. పార్టీ ఐడెంటిటీ కార్డుతోనే రవి ప్లీనరీకి వచ్చాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్లీనరీకి హాజరుకావడంపై మున్నూరు రవి స్పందిస్తూ... పార్టీలో సీనియర్ కార్యకర్తగా ప్లీనరీకి హాజరయ్యానని చెప్పినట్లు తెలుస్తోంది. అంతకుమించి తానేమీ మాట్లాడలేనని చెప్పినట్లు సమాచారం.

తెలంగాణ ఉద్యమ సమయంలో పాలమూరులో ఉద్యమాన్ని ఉరకలెత్తించాడు మున్నూరు రవి. ఎన్నో కేసులు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత సొంత పార్టీలోనే ప్రతికూలత ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో విభేదాలు మున్నూరు రవికి పార్టీతో గ్యాప్‌ను పెంచాయి. శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో మున్నూరు రవి కూడా నిందితుడిగా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో మున్నూరు రవి టీఆర్ఎస్ ప్లీనరీకి హాజరవడం హాట్ టాపిక్‌గా మారింది. 

Also Read: Horoscope Today April 28 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆ ఆలోచన విరమించుకుంటే మంచిది..  

Also Read: Also Read: GT vs SRH: చివరి ఓవర్లో రషీద్ ఖాన్ వీరవిహారం.. సన్‌రైజర్స్‌పై గుజరాత్ సూపర్ విక్టరీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News