Horoscope Today Aril 28 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆ ఆలోచన విరమించుకుంటే మంచిది..

Horoscope Today  April 28 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ చంద్ర అనుగ్రహం లభిస్తుంది. చంద్రుడి అనుగ్రహం వారిని సరైన దారిలో నడిపించడమే కాదు... అన్నింటా సానుకూల ఫలితాలు తీసుకొస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2022, 11:03 AM IST
  • నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి చంద్ర అనుగ్రహం
  • చంద్రుడి అనుగ్రహంతో ఆయా రాశుల వారికి కలిసొస్తుంది
  • ఏయే రాశుల వారికి ఇవాళ ఎలా జరగబోతుందో తెలుసుకోండి
Horoscope Today Aril 28 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారు ఆ ఆలోచన విరమించుకుంటే మంచిది..

Horoscope Today April 28 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... చంద్రుడి అనుగ్రహం ఉన్నవారికి అన్ని విధాలా కలిసొస్తుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఎటువంటి ఆందోళనలకు చోటు ఉండదు. చంద్రుడి అనుగ్రహం లేనివారికి ఇవాళ నిరాశజనకంగా గడుస్తుంది. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇక్కడ తెలుసుకోండి..

మేషరాశి ( Aries)

ఇవాళ మీకు చంద్రుడి అనుగ్రహం లభించదు. ఫలితంగా ఈరోజంతా నిరాశజనకంగా గడుస్తుంది. అసహనం మిమ్మల్ని వెంటాడుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఎంత ప్రయత్నించినా లక్ష్యంపై దృష్టి సారించలేరు. వృత్తి లేదా వ్యాపార రంగంలో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ప్రత్యర్థులు మీపై పైచేయి సాధిస్తారు. మీ ప్రణాళికలు అంతగా వర్కౌట్ కాకపోవచ్చు. మితిమీరిన ఆత్మవిశ్వాసం మిమ్మల్ని వాస్తవ దూరంగా ఆలోచింపజేస్తోంది. 

వృషభ రాశి (Taurus)

ఇవాళ మీపై చంద్రుడి అనుగ్రహం ఉంటుంది. పని భారం, ఒత్తిడి తగ్గుతాయి. మీ సంపాదన పెట్టుబడిగా మారి లాభాలను తీసుకొస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతారు. విదేశాల నుంచి మీకు ఓ ఆర్డర్ అందవచ్చు. అది మీ వ్యాపార పురోగతికి దోహదపడుతుంది. త్వరలోనే మీ సోల్‌మేట్‌ను కలుసుకుంటారు. విద్యార్థులు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. 

మిథున రాశి (GEMINI)

చంద్రుడి అనుగ్రహం మీపై ఉంటుంది. వృత్తిపరంగా బాగా రాణిస్తారు. కొలిగ్స్ సహాయ సహకారాలతో బిజినెస్‌లో మరింత రాణిస్తారు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను తీసుకొస్తాయి. మీ తెలివి తేటలతో అదనపు ఆదాయ మార్గాలను వెతుక్కుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.

కర్కాటక రాశి (Cancer) 

మీ ఆలోచనా ధోరణి పాజిటివ్‌ దృక్పథంతో సాగుతుంది. ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా దృష్టి సారిస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు. మీ అంతరంగ ఆలోచనలను అర్థం చేసుకునే వ్యక్తులతోనే పంచుకోండి. అనవసరంగా అందరితో మీ ఆలోచనల గురించి చర్చించవద్దు. ప్రేమికులు అనవసర విషయాలపై చర్చించి మనస్పర్థలు తెచ్చుకోవద్దు.

సింహ రాశి (LEO)

ఇవాళ మీరు ఎనర్జిటిక్‌గా ఉండకపోవచ్చు. ఓపిక కూడా తక్కువే. ఏ పనైనా సరే మీ అంతరంగాన్ని నమ్మండి. పరిశోధన లేదా మరేదైన సబ్జెక్ట్‌పై మీ అవగాహన అద్భుతమని అందరూ కొనియాడుతారు. ఏదైనా దైవ మంత్రాన్ని పఠిస్తే మీకు మరింత కలిసొస్తుంది. మిమ్మల్ని ఆటంకాల నుంచి బయటపడేస్తుంది.

కన్య రాశి (Virgo)

చంద్రుడి అనుగ్రహం మీకు అన్ని విధాలా కలిసొస్తుంది. వ్యాపార పరంగా కొత్త అవకాశాలు ఏర్పడుతాయి. కొత్త దారుల్లో బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్తారు. కొత్త పరిచయాలు మీ వ్యాపార విస్తృతికి దోహదపడుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు భవిష్యత్‌పై ఆశాజనకంగా ఉంటారు. పెళ్లయిన జంటలు శుభవార్త వింటారు. 

తులా రాశి (Libra)

చంద్రుడి అనుగ్రహంతో అంతా సాఫీగా సాగుతుంది. చాలాకాలంగా మీకు రావాల్సిన బకాయి డబ్బు అందుతుంది. దాన్ని వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతారు. వ్యాపార భాగస్వాముల సమన్వయంతో బిజినెస్‌ను కొత్త పుంతలు తొక్కిస్తారు. చట్టపరమైన విషయాల్లో మీకు అనుకూలంగా జరుగుతుంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి.

వృశ్చిక రాశి (Scorpio)

ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి శుభవార్త అందుతుంది. కాంపిటీటివ్ పరీక్షల్లో రాణించేందుకు ప్రిపరేషన్‌పై గట్టిగా ఫోకస్ చేస్తారు. పెళ్లి విషయంలో సింగిల్స్‌కు మంచి సంబంధాలు వస్తాయి. కొత్త జంటలు శుభవార్త చెబుతారు. వృత్తిపరమైన, వ్యాపారపరమైన జీవితం ఆనందంగా సాగుతుంది. 

ధనుస్సు రాశి (Sagittarius)  

ప్రస్తుతం మీరు ఉంటున్న చోటు నుంచి మరో చోటుకు మకాం మార్చే ఆలోచనలో ఉంటారు. అయితే ఆ ఆలోచనను తాత్కాలికంగా విరమించకుంటే మంచిది. అలాగే, పెట్టుబడులకు కూడా ఇప్పుడు ప్రతికూల సమయం. కాబట్టి ఎలాంటి ప్రాజెక్టుల్లో ఇప్పుడు డబ్బులు పెట్టవద్దు. ఉదయం పూట కొన్ని ప్రతికూలతలు వెంటాడినప్పటికీ... సాయంత్రం సమయానికి అన్నీ సర్దుకుంటాయి. 

మకర రాశి (Capricorn) 

ఓపికతో పనులు చేపడుతారు. కొందరు వ్యక్తుల సలహాలు, సూచనలు మీ లక్ష్యం వైపు సాగే దిశలో మిమ్మల్ని మరింత ఉత్తేజపరుస్తాయి. అవి మీ ప్రాజెక్టును మరింత వేగవంతంగా పూర్తి చేయడంలో దోహదపడుతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సహాయ సహకారాలు అన్ని వేళలా ఉంటాయి. ఒకానొక ప్రభావశీలమైన వ్యక్తి మీ జీవితంపై గట్టి ప్రభావం చూపుతాడు.

కుంభ రాశి (Aquarius)

ఇంటి పునర్నిర్మాణం చేపడుతారు. ఇంటికి సంబంధించిన పలు వస్తువులను కొనుగోలు చేస్తారు. కళాకృతుల కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. ఫ్యామిలీ బిజినెస్‌లో కొత్త ప్లాన్స్ అమలుచేస్తారు. భవిష్యత్తులో అది లాభాలను తీసుకొస్తుంది. ఫ్యామిలీ లేదా సోషల్ గెట్ టు గెదర్‌లో పాల్గొంటారు.

మీన రాశి (Pisces) 

ఇవాళ మీకు అన్ని విధాలా కలిసిరావొచ్చు. వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా అంతా బాగుంటుంది. చేపట్టిన పనిని ఎంజాయ్ చేస్తారు. అయితే ముక్కు సూటితనం వదులుకుంటే మంచిది. అనవసర విషయాలపై చర్చలు జరిపి మీ స్థాయిని తగ్గించుకోవద్దు. ప్రేమికులు తమ తల్లిదండ్రులతో ప్రేమ విషయాలు చర్చించేందుకు అనువైన సమయం. 

Also Read: GT vs SRH: చివరి ఓవర్లో రషీద్ ఖాన్ వీరవిహారం.. సన్‌రైజర్స్‌పై గుజరాత్ సూపర్ విక్టరీ!

Also Read: Anushka Shetty in Acharya: అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్‌.. ఆచార‍్యలో స్టార్ హీరోయిన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News