HCU Muslim Students Unions: హెచ్‌సీయూలో బిబిసి డాక్యుమెంటరీ స్క్రీనింగ్ కలకలం.. క్యాంపస్‌లో హై టెన్షన్

BBC Documentary Screening in HCU: ఒకే భావజాలం కలిగిన స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఓ), ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) విద్యార్థి సంఘాలు బిబిసి డాక్యుమెంటరీ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేసినట్టు తెలుసుకున్న యూనివర్శిటీ యాజమాన్యం.. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2023, 12:33 AM IST
HCU Muslim Students Unions: హెచ్‌సీయూలో బిబిసి డాక్యుమెంటరీ స్క్రీనింగ్ కలకలం.. క్యాంపస్‌లో హై టెన్షన్

BBC Documentary Screening in HCU: కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2002 నాటి గోద్రా అల్లర్లు, రామ మందిరం నిర్మాణ ఘర్షణలపై ఇండియా: ది మోదీ క్వశ్చన్ పేరిట బిబిసి ఒక డాక్యుమెంటరీని తెరకెక్కించిన సంగతి తెలిసింగదే. అయితే, బీబీసీ డాక్యుమెంటరీతో దేశంలో మరోసారి మతకల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీపై నిషేధం విధించింది. భారత ప్రభుత్వం నిషేధించిన బిబిసి డాక్యుమెంటరీని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యూనివర్సిటీ వీసీ అనుమతి లేకుండా SIO, MSF విద్యార్థి సంఘాలు స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం కలకలం సృష్టించింది. నార్త్ షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలో 50 మంది విద్యార్థులతో కలిసి ఈ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.  

ఒకే భావజాలం కలిగిన స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఓ), ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) విద్యార్థి సంఘాలు బిబిసి డాక్యుమెంటరీ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేసినట్టు తెలుసుకున్న యూనివర్శిటీ యాజమాన్యం.. వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించింది. యూనివర్శిటీలో డాక్యుమెంటరీ స్క్రినింగ్ అడ్డుకుని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిందిగా యూనివర్శిటీ యాజమాన్యం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఇది యూనివర్శిటీలో సమస్య అయినందున.. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోది దర్యాప్తు చేస్తామని గచ్చిబౌలి పోలీసులు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది.

శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం నిషేధించిన బీసీ డాక్యుమెంటరీని యూనివర్శిటీలో ప్రదర్శించడంపై ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. దేశంలో మళ్ళీ అల్లర్లు సృష్టించడానికి కుట్రలు జరుగుతున్నాయని.. అందువల్లే ఈ బిబిసి డాక్యుమెంటరీ తెరపైకొచ్చిందని.. యూనివర్శిటీ రూల్స్‌కి వ్యతిరేకంగా ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై, డాక్యుమెంటరీని వీక్షించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ మాజీ నేషనల్ కన్వీనర్ మహేష్ డిమాండ్ చేశారు. 

muslim-students-unions-arranges-bbc-documentary-india-the-modi-question-screening-in-hyderabad-central-university.jpg

రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పలు చెదురుముదురు ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ.. గత కొంత కాలంగా యూనివర్శిటీలో మాత్రం ప్రశాంతమైన వాతావరణమే నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ కీలక పరిణామం మళ్లీ ఎటువైపునకు దారితీస్తుందోననే ఆందోళన అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులలో ఇటు వారి తల్లిదండ్రులలో నెలకొని ఉంది. 

ఇది కూడా చదవండి : BBC documentary on PM Modi: ప్రధాని మోదీపై డాక్యుమెంటరీ.. విద్యార్థులకు జేఎన్‌యూ ఆదేశాలు

ఇది కూడా చదవండి : Republic Day 2023: రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు, చీఫ్ గెస్ట్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు

ఇది కూడా చదవండి : Parliament New Building Photos: పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఫోటోలు.. పాతదానికి, కొత్తదానికి డిజైన్ తేడా చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News