Hyderabad Population: దేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత స్పీడ్ గా అభివృద్ది చెందుతున్న నగరాల జాబితాలో భాగ్యనగరం ఒకటి అనడంలో సందేహం లేదు. దక్షిణ భారతంలో ఉన్న పెద్ద నగరాల్లోకి హైదరాబాద్ నగరం చాలా ప్రత్యేక స్థానంను కలిగి ఉంది. అభివృద్దిలో దూసుకు పోతున్న నగరం అవ్వడంతో పాటు జనాభా విషయంలో కూడా హైదరాబాద్ దూసుకు పోతుంది. ఐక్యరాజ్య సమితి మరియు భారత ప్రభుత్వం లెక్కల అనుసారం 1921 సంవత్సరంలో హైదరాబాద్ జనాభా కేవలం 4.05 లక్షలు. వంద సంవత్సరాల్లో ఆ జనాభా కాస్త కోటికి పైగా చేరింది.
భారత దేశంలో 9 రాష్ట్రాలు మరియు పలు కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క జనాభా కంటే కూడా హైదరాబాద్ జనాభా ఎక్కువగా ఉంది. ఇక ప్రపంచంలోని అన్ని దేశాల జనాభాతో గ్రేటర్ హైదరాబాద్ జనాభాను పోల్చితే ఏకంగా 140 దేశాల కంటే కూడా గ్రేటర్ హైదరాబాద్ జనాభా ఎక్కువగా ఉన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి. లక్షల లోపు జనాభా ఉన్న దేశాలు ప్రపంచంలో 35 ఉన్నాయి.
ఇక కోటి లోపు జనాభా ఉన్న దేశాలు ఆరు ఉన్నాయి. మొత్తానికి ప్రపంచంలోని 140 దేశాల జనాభా కంటే కూడా హైదరాబాద్ జనాభా ఎక్కువ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. విస్తీర్ణంలో చాలా తక్కువ ఉన్నప్పటికి జనాభా విషయంలో అతి ఎక్కువ అన్నట్లుగా పరిస్థితి ఉంది. దేశంలో అత్యంత స్పీడ్ గా జనాభా పెరుగుతున్న నగరాల జాబితాలో గ్రేటర్ హైదరాబాద్ ముందు ప్లేస్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు.
ఐక్యరాజ్య సమితి జనాభా అంచనా విభాగం యొక్క లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ యొక్క జనాభా ప్రస్తుతం 1.05 కోట్లుగా ఉంది. ఈ సంవత్సరం చివరి వరకు అంటే 2024 ఆరంభం వరకు 1.08 కోట్లకు జనాభా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్ యొక్క జనాభా పెరుగుదల చూస్తూ ఉంటే ముందు ముందు మరిన్ని దేశాల యొక్క జనాభాను కూడా క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదు అన్నట్లుగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లో ఉన్న మౌళిక వసతులు మరియు వ్యాపారాలు ఇంకా ఇతర కారణాల వల్ల జనాభా విపరీతంగా పెరుగుతున్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
పెరుగుతున్న జనాభా కి తగ్గట్లుగానే మౌళిక వసతుల ఏర్పాట్లు కూడా ఉండటం వల్ల ఆ జనాభా పెరుగుదల అనేది మరింతగా పెరుగుతుంది. ముందు ముందు జనాభా పెరగడం వల్ల సమస్యలు తప్పవని కొందరు అంటూ ఉంటే కొందరు మాత్రం మ్యాన్ పవర్ పెరుగుతున్నా కొద్ది హైదరాబాద్ మరింత అభివృద్ది జరుగుతుందని విశ్లేషిస్తున్నారు.
Also Read: Anasuya Bikini Pics : మొదటి సారిగా బికినీలో అనసూయ.. ఫ్యామిలీ ఫ్యామిలీ మునిగిందిగా?.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook