New coronavirus effect: హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలపై నిషేధం

New coronavirus effect: కరోనా వైరస్ ప్రభావం..ముఖ్యంగా బ్రిటన్ కొత్త రకం కరోనా వైరస్ ప్రభావం నూతన వత్సర వేడుకలపై పడింది. హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకల్ని నిషేధించారు.

Last Updated : Dec 25, 2020, 09:52 PM IST
  • హైదరాబాద్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలు నిషేధం
  • అన్ని గేటెడ్ కమ్యూనిటీల్లోనూ నిషేధమే..పొలీసుల నిఘా
  • ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని సైబరాబాద్ కమీషనర్ హెచ్చరిక
New coronavirus effect: హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలపై నిషేధం

New coronavirus effect: కరోనా వైరస్ ప్రభావం..ముఖ్యంగా బ్రిటన్ కొత్త రకం కరోనా వైరస్ ప్రభావం నూతన వత్సర వేడుకలపై పడింది. హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకల్ని నిషేధించారు.

ఓ వైపు కరోనా వైరస్ ( Coronavirus ) పూర్తిగా అదుపులో రాకముందే...రూపు మార్చుకుంది. బ్రిటన్ ( Britain ) నుంచి ప్రారంభమై..పలు దేశాలకు వ్యాపించి ఆందోళన కల్గిస్తున్న కొత్త కరోనా వైరస్ ( New coronavirus )..అందర్నీ భయపెడుతోంది. యూకే నుంచి  ఇండియాకు రిటర్న్ అయినవారికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో..ఇండియాలో భయం పట్టుకుంది. ఇప్పటికే పలు దేశాలు, రాష్ట్రాలు 2021 నూతన వత్సర వేడుకల్ని నిషేధించడం, ఆంక్షలు అమలు చేయడం చేస్తున్నాయి.  ఈ క్రమంలో హైదరాబాద్‌ ( Hyderabad )లో  నూతన సంవత్సర వేడుకల ( New year Celebrations )పై నిషేధం విధించారు. వేడుకలకు సంబంధించి పబ్లిక్, ఎంటర్‌టైన్మెంట్ కార్యక్రమాల్ని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 

డిసెంబర్ 31 రాత్రి పబ్స్, రిసార్ట్స్, స్టార్ హోటల్ ఈవెంట్స్, ఫంక్షన్ హాల్స్, ఫార్మ్‌హౌజ్‌లు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని సైబరాబాద్ కమీషనర్ వీసీ సజ్జనార్ ( Cyberabad cp sajjanar ) తెలిపారు. పోలీసుల నిఘా కొనసాగుతుందని..ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పబ్స్, స్టార్ హోటల్స్‌లో రోజువారీ కార్యక్రమాలకే అనుమతి ఉంటుందని చెప్పారు.

Also read: Christmas tree tattoo: వి సినిమాతో పోయిన క్రేజ్..ఆ టాటూతో వచ్చేసిందట

Trending News