Liquor Shop License: తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లకు గాను మద్యం షాపుల లైసెన్స్ కి గాను నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలోని మొత్తం 2,620 షాపుల్లో 1834 షాపులకు ఓపెన్ కేటగిరీలో ఆసక్తిగల వారు అప్లై చేసుకోవచ్చు. మిగిలిన 786 మద్యం షాపులకు మాత్రం గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేయడం జరిగింది.
రిజర్వ్ చేసిన షాపుల్లో 15 శాతం గౌడలకు, 10 శాతం ఎస్సీలకు మరియు 5 శాతం ఎస్టీలకు కేటాయించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. 2023 - 2025 సంవత్సరాలకు సంబంధించిన లైసెన్స్ కోసం నోటిఫికేషన్ నేడు శుక్రవారం విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కార్యాలయం నుండి అధికారికంగా ప్రకటన వచ్చింది.
రాష్ట్రంలోని వారు రాష్ట్రంలో ఎక్కడైనా లైసెన్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే రిజర్వ్ చేసిన వాటికి మాత్రం వేరే వారు అప్లై చేసుకోవద్దు. కుల దృవీకరణ పత్రంతో రిజర్వ్ చేసిన షాప్ లకు దరకాస్తు చేసుకోవచ్చు అంటూ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ దరకాస్తులు ఇవ్వచ్చు.
అంతే కాకుండా నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో కూడా దరకాస్తు చేసుకోవచ్చు. నాంపల్లిలో రాష్ట్రంలోని అన్ని మధ్యం షాపులకు కూడా దరకాస్తు చేసే అవకాశంను అధికారులు కల్పించడం జరిగింది. ఈనెల 21న లాటరీ నిర్వహించి మద్యం దుకాణాలు ఎవరికి కేటాయించింది ప్రకటించబోతున్నట్లుగా పేర్కొన్నారు.
Also Read: iPhone15 Launch Date: ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫీచర్లు లీక్, లాంచ్
డీడీ చెల్లించి లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా వేలం పాట కాదు కనుక ఇది పూర్తిగా అదృష్టం పైనే ఆధార పడి ఉంటుంది. నిన్నటితో ప్రస్తుతం ఉన్న మద్యం షాపులకు లైసెన్స్ గడువు ముగిసింది. కనుక వెంటనే కొత్త మద్యం షాపుల లైసెన్స్ ను పునరుద్దరించే ఉద్దేశ్యంతో హడావుడిగా నోటిఫికేషన్ ను తీసుకు రావడం జరిగింది.
మధ్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కు మెజార్టీ ఆదాయం లభిస్తుంది. అందుకే ఆగమేఘాలపై నోటిఫికేషన్ విడుదల చేయడం.. ఆ వెంటనే హడావుడిగా కేటాయించడం కూడా జరుగుతుందని సామాన్యులు అంటున్నారు. ఒక వైపు మధ్యం షాపులు మూసి వేయాలని కొందరు కోరుకుంటూ ఉంటే కొందరు మాత్రం మాకు మద్యం షాపులు కావాలని వేడుకుంటున్నారు.
Also Read: Reliance Jio Plan: జియోలో ఆ పోస్ట్ పెయిడ్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook