టోల్ ప్లాజా సిబ్బంది అత్యుత్సాహం.. ఎమ్మెల్సీకి చేదు అనుభవం!

పతంగి టోల్ ప్లాజా సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్సీని అని చెప్పినా మాట వినకుండా అడ్డుకున్నారు. విషయం తెలిశాక బుకాయించే ప్రయత్నం చేశారు.

Last Updated : Feb 24, 2020, 01:04 PM IST
టోల్ ప్లాజా సిబ్బంది అత్యుత్సాహం.. ఎమ్మెల్సీకి చేదు అనుభవం!

చౌటుప్పల్: ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ఫ్లాజా సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించి ఎమ్మెల్సీని అడ్డుకున్నారు. చివరికి నిజం తెలిసి నాలుక కరుచుకున్నారు. కేవలం తనను మాత్రమే అడ్డుకోవడంపై ఆయన నిరసన తెలిపారు. పతంజలి టోల్ గేట్ వద్ద బైఠాయించారు. సోమవారం (ఫిబ్రవరి 24న) ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. 

See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా

ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వాహనం పతంగి టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. వాహనాన్ని అడ్డుకున్న సిబ్బంది, టోల్ ఫీజ్ చెల్లించి వెళ్లాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లికి సూచించారు. తాను ఎమ్మెల్సీనని చెప్పడంతో పాటు టోల్ సిబ్బందికి ఐడీ కార్డు చూపించారు. అయితే గన్ మెన్ వెంట లేకపోవడంతో ఎమ్మెల్యే అని గుర్తించలేకపోయాయని సిబ్బంది చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

See Photos: ఫొటోషూట్ కోసం టాప్ లేపిన ముద్దుగుమ్మలు! 

ఆ తర్వాత కూడా సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. టోల్ ఫీజు మినహాయింపు జాబితాలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేరు లేదని చెబుతూ సిబ్బంది బుకాయించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు పతంగి టోల్ ప్లాజా సిబ్బందికి  ఫోన్ చేసి ఆయనను అనుమతించాలని ఆదేశించారు. అయితే ఏ ఎమ్మెల్సీని ఆపకుండా.. కేవలం తననే ఎందుకు ఆపారో వివరణ ఇవ్వాలంటూ మండిపడ్డారు. సిబ్బంది తీరుకు నిరసనగా టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కాసేపు బైఠాయించారు.

Also Read: ‘నమస్తే ట్రంప్’ నుంచి బై బై ట్రంప్ వరకు

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News