PM Narendra Modi: ఢంకా భజాయించి చెబుతున్నా.. బీఆర్ఎస్ ఓటమి ఖాయం: ప్రధాని మోదీ జోస్యం

BC Atma Gourava Sabha in LB Stadium: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ప్రధాని మోదీ. తెలంగాణ ప్రజలు బీజేపీపై నమ్మకంతో ఉన్నారని.. బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్‌ఏ ఒక్కటేనని విమర్శించారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 9, 2023, 11:24 AM IST
PM Narendra Modi: ఢంకా భజాయించి చెబుతున్నా.. బీఆర్ఎస్ ఓటమి ఖాయం: ప్రధాని మోదీ జోస్యం

BC Atma Gourava Sabha in LB Stadium: ఢంకా భజాయించి చెబుతున్నానని.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభకు మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం తన అదృష్టం అని అన్నారు. మీ ఆశీర్వాదంతోనే తాను ప్రధాని అయ్యానని.. మీ ఆశీర్వాదంతోనే బీజేపీ బీసీ వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చిందని.. అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రజలను దారుణంగా మోసం చేసిందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీపై నమ్మకంతో ఉన్నారని చెప్పారు.

బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని.. అవినీతి, కుటుంబ పాలన పార్టీలని విమర్శించారు ప్రధాని మోదీ. బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది బీజేపీ మాత్రమేని.. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చిందని చెప్పారు. బీసీ యువత కోసం బీఆర్ఎస్ ఏమీ చేయట్లేదని.. రూ.లక్ష ఇస్తామన్న హామీని నెరవేర్చలేదన్నారు. తాము మెడికల్‌, డెంటల్‌ సీట్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని.. విశ్వకర్మ పథకం ద్వారా బీసీలకు అవకాశాలిచ్చామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నాయకుల్లో అహంకారం కనిపిస్తోందని.. అవినీతి సర్కారును ఇంటికి పంపడం ఖాయమన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశౄరు. అధికారంలోకి రాగానే.. పేదలకు ఐదేళ్లపాటు ఉచితంగా బియ్యం అందిస్తామని.. ఇది తాను ఇస్తున్న గ్యారెంటీ అని మోదీ ప్రకటించారు.

అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం ఇదే స్టేడియానికి గుజరాత్‌ సీఎంగా నరేంద్ర మోదీ వచ్చారని.. ఆ సభ దేశ చరిత్రలో మార్పునకు నాందిగా నిలిచిందని అన్నారు. ఆ సభ తర్వాతనే మోదీ భారత ప్రధాని అయ్యారని గుర్తుచేసుకున్నారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్, మజ్లిస్‌ ఒకే తాను ముక్కలు అని.. మన్మోహన్‌ హయాంలో కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్​ఎస్‌​కు అమ్ముడుపోయారా..? లేదా..? ఆ పార్టీ చెప్పాలని డిమాండ్ చేశారు. ద్రౌపదిముర్ము రాష్ట్రపతి అభ్యర్థిగా హైదరాబాద్‌కు వస్తే కేసీఆర్‌ స్వాగతం పలికేందుకు రాలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటే.. బొమ్మ బొరుసు లాంటి పార్టీలు అని విమర్శించారు. ప్రజలందరూ ఆలోచించి.. బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సకల జనులు సమరం చేస్తే తెలంగాణ వచ్చిందని.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగించిన సమరం తెలంగాణ ఉద్యమం అని అన్నారు. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి నెలకొందన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని.. ఐదేళ్ల పాటు ఎన్నికలే ధ్యేయంగా ఉండొద్దన్నారు. ఎన్నికలే ధ్యేయంగా ప్రధాని మోదీ పనిచేస్తే.. 317 ఆర్టికల్, మహిళా రిజర్వేషన్ బిల్లు, ట్రిపుల్ తలాక్, అయోధ్య రామ మందిరం నిర్మాణమయ్యేదా..? ప్రశ్నించారు. బీసీ ముఖ్యమంత్రి చేయడానికి జనసేన మద్దతు తప్పకుండా ఉంటుందని.. దేశం బాగుపడాలంటే మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ కావాలన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి అండగా ఉంటామని స్పష్టం చేశారు.

Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…

Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News