PM Modi: నేడు తెలంగాణకు ప్రధాని మోదీ.. డుమ్మా కొట్టనున్న సీఎం కేసీఆర్..!

PM Modi: ప్రధాని నరేంద్రమోదీ శనివారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2022, 06:58 AM IST
PM Modi: నేడు తెలంగాణకు ప్రధాని మోదీ.. డుమ్మా కొట్టనున్న సీఎం కేసీఆర్..!

PM Modi Telangana tour: ఇవాళ ప్రధాని మోదీ తెలంగాణకు వెళ్లనున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడంతోపాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటనకు సీఎం కేసీఆర్ (CM KCR) హాజరు కావడం లేదు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రామగుండంలో (PM Modi Ramagundam tour) భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎరువుల కర్మాగారం వద్దకు ప్రధాని చేరుకుని.. అనంతరం బహిరంగ సభో ప్రసంగించనున్నారు. 

ప్రధాని ఈ టూర్ లో ఎరువుల ఫ్యాక్టరీని, భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అదే విధంగా రూ.2,268 కోట్లతో చేపట్టే పలు జాతీయ రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన శిలాఫలకాలను డిజిటల్ విధానంలో ఆవిష్కరించనున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను వేదికపై దృశ్య రూపంలో ప్రదర్శించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో... ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, భగవంత్‌ ఖుబాతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ తదితర నాయకులు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను సందర్శించారు. 

మోదీ పర్యటన నేపథ్యంలో వామపాక్ష పార్టీలు బంద్ కు పిలుపునిచ్చాయి. ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ (Minister Talasani Srinivasyadav) స్వాగతం పలకనున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సీఎం కేసీఆర్ ఈ పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. 

Also Read: TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసు.. పోలీసులకు నో చెప్పిన ఏసీబీ కోర్టు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News