Panjagutta child murder : పంజాగుట్ట చిన్నారి మృతదేహం కేసులో దర్యాప్తు ముమ్మరం

 Panjagutta child murder case: మృతి చెందిన బాలిక కడుపుపై, వీపుపై గాయాలున్నట్లు ఉస్మానియా హాస్పిటల్ (Osmania Hospital) డాక్టర్స్ పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. బాలిక మృతదేహాన్ని పడేసి వెళ్లిన మహిళ, ఆమె వెంట వచ్చిన వ్యక్తి, బాబు ఎవరనే విషయంపై పోలీసులు (Police) ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2021, 06:38 PM IST
  • పంజాగుట్ట చిన్నారి మృతదేహం కేసులో వేగంగా దర్యాప్తు
  • సీసీ కెమెరాల ఆధారంగా విచారణ
  • వ్యక్తి, బాబుతో కలిసి వచ్చి చిన్నారి మృతదేహాన్ని వదిలి వెళ్లిన ఓ మహిళ
  • బెంగళూరులో హత్య చేసి హైదరాబాద్‌లో పడేసినట్లు అనుమానం
Panjagutta child murder : పంజాగుట్ట చిన్నారి మృతదేహం కేసులో దర్యాప్తు ముమ్మరం

Police investigate hyderabad panjagutta child murder mystery : పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ద్వారకాపురిలో లభించిన చిన్నారి మృతదేహం (Dead body) కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఆ బాలికది హత్యగా తేల్చారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారంగా విచారణ కొనసాగుతోంది. 

పోలీసులు (Police) తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ.. వ్యక్తి, బాబుతో కలిసి లకిడీకాపూల్ వైపు నుంచి ఆటోలో వచ్చి ద్వారకాపురిలోని ఓ షాప్‌ వద్ద ఈ నెల 4న చిన్నారి మృతదేహాన్ని వదిలి వెళ్లింది. కర్ణాటక నుంచి వచ్చిన బస్సులో లకిడీకాపూల్‌లో దిగిన నలుగురు అక్కడ ఆటో మాట్లాడుకున్నారు. ఓ కుటుంబంలా ఆటోలో వచ్చి ద్వారకాపురి కాలనీలో (Dwarkapuri Colony) చిన్నారి మృతదేహాన్ని వదిలేసి మెహదీపట్నం వైపు వెళ్లారు. ఇదంతా సీసీ కెమెరాల్లో (CCTV cameras) రికార్డైంది. ఇక పోలీసులు మెహదీపట్నంతో (Mehdipatnam) పాటు లకిడీకాపూల్‌లో ఉన్న ట్రావెల్స్‌ కార్యాలయాల్లోని సీసీ కెమెరాలన్నింటినీ పరిశీలిస్తున్నారు.

Also Read : Man kills wife : టవల్ ఆలస్యంగా ఇచ్చిందని భార్యనే చంపిన భర్త

మృతి చెందిన బాలిక కడుపుపై, వీపుపై గాయాలున్నట్లు ఉస్మానియా హాస్పిటల్ (Osmania Hospital) డాక్టర్స్ పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. బాలిక మృతదేహాన్ని పడేసి వెళ్లిన మహిళ, ఆమె వెంట వచ్చిన వ్యక్తి, బాబు ఎవరనే విషయంపై పోలీసులు (Police) ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ మహిళ ఆచూకీ కోసం పదికి పైగానే పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. ఆమె కర్ణాటక వైపు వెళ్లే అవకాశం ఉండటంతో సరిహద్దు పోలీసులను (Police) అప్రమత్తం చేశారు. 

అయితే చిన్నారిని బెంగళూరులో (Bangalore) హత్య చేసి హైదరాబాద్‌లో పడేసినట్లు అనుమానిస్తున్నారు. ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే హత్యకు (murder) కారణమని తెలుస్తోంది.

Also Read : Fake currency in Hyderabad : హైదరాబాద్ లో రూ.2 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News