close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

బస్సు బోల్తా పడి 40 మందికి గాయాలు

బస్సు బోల్తా పడి 40 మందికి గాయాలు

Updated: Oct 10, 2019, 10:08 AM IST
బస్సు బోల్తా పడి 40 మందికి గాయాలు
Representational image

ఖమ్మం: జిల్లాలోని సత్తుపల్లి మండలం పాకలగూడెం గ్రామ శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

ఓవైపు ఆర్టీసి సమ్మె, మరోవైపు దసరా పండగ ముగించుకుని జనం తిరుగుప్రయాణమైన నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు గిరాకీ పెరిగింది. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ మందిని గమ్యానికి చేరవేసి సాధ్యమైనంత మేరకు సొమ్ము చేసుకోవాలనే ఆశతో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు.. రోడ్లపై ఎప్పుడూ వెళ్లే వేగం కన్నా ఇంకాస్త ఎక్కువ వేగంతోనే వెళ్తున్నారు అంటున్నారు ప్రైవేట్ ట్రావెల్స్‌ని ఆశ్రయిస్తున్న ప్రయాణికులు.